E-Paper
Advertisement

గ్రీన్ భారీ సిక్స‌ర్‌..టాటా కారు డ్యామేజ్‌, రూ.5 ల‌క్ష‌లు జేబులోంచి క‌ట్టాల్సిందే

గ్రీన్ భారీ సిక్స‌ర్‌..టాటా కారు డ్యామేజ్‌, రూ.5 ల‌క్ష‌లు జేబులోంచి క‌ట్టాల్సిందే
Advertisement

Cameron Green Six:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో పావుల శాతం మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ కోల్ క‌తా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Kolkata Knight Riders, 25th Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దీంతో ఎప్పటి లాగే కేకేఆర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు చేరితే.. కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) మాత్రం తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. అంతేకాదు అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు టాటా సియెర్రా కారు ( Tata Sierra car) బద్దలైంది. ఆ కారు డోర్ దగ్గర డెంట్ పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారింది. అయితే, ఇలా కారు డ్యామేజ్ అయితే, టాటా కంపెనీ రూ.5 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

గ్రీన్ భారీ సిక్స‌ర్‌..టాటా కారు డ్యామేజ్‌

Advertisement

కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. 79 పరుగులతో రాణించిన కామెరాన్ గ్రీన్… ఈ మ్యాచ్ 14 ఓవర్ లో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి టాటా సియెర్రా కారు ( Tata Sierra car) డోర్ కు తగిలింది. దీంతో చిన్నపాటి డ్యామేజ్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రూ.5 ల‌క్ష‌లు జేబులోంచి టాటా మోటార్స్ క‌ట్టాల్సిందే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఎవరైనా ఆటగాడు ఇలా కారు డ్యామేజ్ చేస్తే స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ప్రకారం … టాటా మోటార్స్ సంస్థ 5 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డబ్బులతో గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ విభాగాలలో ఖర్చు చేస్తారు. గతంలో కూడా ఇలా కారు డ్యామేజ్ అయినప్పుడు టాటా కంపెనీ 5 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రీన్ చేసిన పనికి కూడా టాటా జేబులో నుంచి డబ్బులు చెల్లించాల్సిందే. ఇది ఇలా ఉండగా కామెరాన్‌ గ్రీన్ డ్యామేజ్ చేసిన టాటా సియెర్రా కారు ( Tata Sierra car) ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఐపీఎల్ టోర్నమెంట్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాడికి ఈ కారు దక్కుతుంది. దీంతో రూ.25 కోట్ల ప్లేయ‌ర్… రూ.21 ల‌క్ష‌ల కారు డ్యామేజ్ చేశాడ‌ని ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

?igsh=MWpyeHByajlkZXMzOA==

 

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×