E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘బెటర్ హాఫ్’ అంటే కేవలం భార్య మాత్రమేనా? ఈ పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా!

‘బెటర్ హాఫ్’ అంటే కేవలం భార్య మాత్రమేనా? ఈ పదం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా!
Advertisement

Relation Tips :బెటర్ హాఫ్.. ఈ పదం మనం తరచుగా వింటూనే ఉంటాం. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడో.. పెళ్లయ్యాకో.. మనం తరచుగా వాడే పదం ‘మై బెటర్ హాఫ్’ (My Better Half). పది మందిలో తన భార్యను పరిచయం చేయాలన్నా, సోషల్ మీడియాలో భార్యతో ఫోటో దిగి క్యాప్షన్ పెట్టాలన్నా, భర్తలు ముద్దుగా ‘మై బెటర్ హాఫ్’ పదం వాడుతుంటారు. మరింతకీ బెటర్ హాఫ్ వెనకాలున్న అసలు మ్యాటర్ ఏంటో, ఎందుకు భార్యని బెటర్ హాఫ్ అని పిలుస్తారో తెలుసుకుందామా!

ప్రతి మగాడి జీవితం ఇన్ కంప్లీట్

Advertisement

నిజానికి పెళ్లికి ముందు ప్రతి మగాడి జీవితం ఇన్ కంప్లీట్ గానే ఉంటుంది. బాధ్యతలు లేకుండా, ఒంటరిగా, నేనే అన్న స్వార్థంతో అలా అలా సాగిపోతూ ఉంటుంది. కాని ఎప్పుడైతే పెళ్లి అయి భార్య లైఫ్‌లోకి అడుగు పెడుతుందో అప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం, పరిపూర్ణత వస్తుంది. అలా కలిసి మెలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని, కష్ట సుఖాలని చేరి సమానంగా పంచుకుంటూ, సపోర్ట్ చేసుకున్నప్పుడే ఆ రిలేషన్ షిప్ సక్సెస్ అవుతుంది. సో.. మీలో ఉన్న సగాన్ని కంప్లీట్ చేసేది మీ వైఫ్ అంటే మీ బెటర్ హాఫ్ అన్న మాట.

కష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా

Advertisement

ఇక భార్యను బెటర్ హాఫ్ అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా.. యాక్సెప్టెన్స్ (Acceptance) భర్తకు కోపమొచ్చినా, కష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. తనను తనలాగే చూసేది ఒక్క భార్యనే. భర్త చేసిన తప్పులని ఎత్తి చూపకుండా వాటిని సరిదిద్దుతూ ముందుకు నడిపిస్తుంది. అలా భర్త ఫ్యామిలీని, అతని పరిస్థితులను తన సొంతంగా భావించే ఆ గుణమే ఆమెను ‘బెటర్’అనిపిస్తుంది.

ALSO READ:పిచ్చెక్కిస్తున్న రాఖీ సావంత్.. ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ ‘కుర్రాళ్ల’పై షాకింగ్ కామెంట్స్!

అదే భార్య మీకు జత కలిస్తే

ఇక చాలామంది మగాళ్లు బయట చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు కానీ, మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అదే భార్య మీకు జత కలిస్తే మార్పు కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న మీ జీవితంలోకి తను సందడిని తెస్తుంది.

ఇక కష్ట సుఖాలలో కలిసి పోయిన భార్యకి ఎవరికీ చెప్పుకోలేని విషయాలను షేర్ చేసుకుంటాడని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు కూడా. ముఖ్యంగా స్వార్థం లేకుండా ఎదుటివారి కోసం బతకడం ఎలాగో భార్య ద్వారానే భర్త నేర్చుకుంటాడు.

జీవితంలో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో

ఇక ఎన్నో సినిమాల్లో చిల్లరగా, పొగరుగా ఉండే హీరోలకి మంచి పద్దతైన అమ్మాయిలు భార్యలుగా వచ్చాక వాళ్ల జీవితంలో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో మనం చూస్తుంటాం కూడా. అన్ని బంధాల్లో ఇలానే జరగకపోయినా చాలా వరకు మగాళ్ల జీవితం బెటర్ హాఫ్‌లు వచ్చాకే సాఫీగా సాగిపోతాయన్నది వాస్తవం..

ఇక పెళ్లి అయ్యాక ఇద్దరి మధ్య కోపతాపాలు, గొడవలు, అలకలు, సమస్యలు రావడం చాలా సహజం. అయితే వాటిని ఇద్దరు కలిసి ఎలా ఎదుర్కుంటారన్నదే ఇక్కడ ముఖ్యం.

ఆ బంధం పదికాలాల పాటు పచ్చగా

అన్నింటికన్నా మించి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. భర్త ఎలాంటి సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని గనుక భార్య అర్థం చేసుకుని అండగా నిలబడితే ఆ సంసారం స్వర్గమయం అయిపోతుంది. ఇక బాధ్యతలను సమానంగా పంచుకున్నప్పుడే ఆ బంధం పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.

సో.. ఫ్యాషన్ కోసమో, స్టైల్ కోసమో ‘బెటర్ హాఫ్’ అని పిలవడం కాదు.. తన లైఫ్‌ని మీకోసం నిరంతరం సాక్రిఫైజ్ చేస్తూ మీకు తోడుగా నిలుచున్న మీ భార్యకి అది మీరిచ్చే గౌరవంగా భావించండి. ఇకనైనా ఈసారి మై బెటర్ హాఫ్ అని పిలిచినప్పుడు అందులోని అర్థాన్ని ఫీల్ అవుతారు కదూ!

ALSO READ:త్రిష ఓటు.. విజయ్‌కి హింట్? సోషల్ మీడియాలో ‘గిల్లి’ రేంజ్ హంగామా!

Related News

వాక్సింగ్, థ్రెడింగ్ అవసరం లేదు.. ముఖంపై వెంట్రుకలు తొలగించడానికి పిండితో ఇలా చేయండి

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పువ్వు లాంటి సున్నిత మనస్కులు

ఖర్చు లేకుండానే డేటింగ్ చేయాలా? తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేయండి

మనిషి చేసే ఈ తప్పుల వల్లే పేదరికం.. చెడు అలవాట్లు ఈ రోజే మానుకోండి

కిచెన్‌లో తక్కువ ధర కత్తులు వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం అదే

హోటల్ కెటిల్స్ వెనుక దాగివున్న భయంకరమైన సీక్రెట్.. తెలిస్తే జన్మలో ముట్టుకోరు!

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ.. ఏది తాగితే బరువు త్వరగా తగ్గుతారు?

ఏ బట్టలు వేసుకున్న పొట్ట బయటకు కనిపిస్తోందా? స్లిమ్‌గా, స్టైలిష్‌ లుక్ కసం ఫ్యాషన్ టిప్స్

Big Stories

×