E-Paper
Advertisement

త్రిష ఓటు.. విజయ్‌కి హింట్? సోషల్ మీడియాలో ‘గిల్లి’ రేంజ్ హంగామా!

త్రిష ఓటు.. విజయ్‌కి హింట్? సోషల్ మీడియాలో ‘గిల్లి’ రేంజ్ హంగామా!
Advertisement

Trisha Vijay: సినిమాలకి, రాజకీయాలకి దగ్గర సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి తమిళనాడులో దళపతి విజయ్ “తమిళగ వెట్రి కళగం (TVK)” అనే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో అందరి కళ్లూ విజయ్ పైనే ఉన్నాయి. ఇక ఇదే ఎన్నికల సమయంలో విజయ్ భార్య సంగీత డైవోర్స్ కేస్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఒక ఎత్తయితే, పోలింగ్ రోజే హీరోయిన్ త్రిష చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయింది.

 సాంగ్‌తో అంతా మారిపోయిందా?

Advertisement

ఈరోజు త్రిష ఓటు వేయగానే తన వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫోటోలు పెట్టడం సహజమే. కానీ, ఆ ఫోటో వెనుక త్రిష ఎంచుకున్న బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీరిద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘గిల్లి’ (తెలుగు ‘ఒక్కడు’ రీమేక్) సినిమాలోని “అర్జునర్ విల్లు” అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను ఆమె బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా పెట్టింది.

Advertisement

త్రిష ఇచ్చిన ’ హింట్

నిజానికి మరో పాట అయితే ఈ డిస్కషన్ ఉండేది కాదేమో. కానీ “అర్జునర్ విల్లు” పాటలో మధ్య మధ్యలో వచ్చే ‘విజిల్’ శబ్దం చాలా ఫేమస్ అవడం, ఇక దళపతి విజయ్ పార్టీ గుర్తు కూడా ‘విజిల్’ కావడంతో త్రిష ఇన్‌డైరెక్ట్‌గా విజయ్‌కే ఓటు వేయాలని సైగ చేసిందని డీకోడ్ చేయడం మొదలెట్టారు విజయ్ ఫ్యాన్స్.

ALSO READ:మెక్సికో గడ్డపై రాజమౌళి ‘మైండ్ గేమ్’.. గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా ‘వారణాసి’ మాస్టర్ ప్లాన్!

ఇక “త్రిష కేవలం ఫోటో పోస్ట్ చేయలేదు.. విజయ్ కోసం ఏకంగా ఒక రాజకీయ ప్రచారాన్నే మొదలుపెట్టింది” అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇకపోతే విజయ్–త్రిషల మధ్య అనుబంధంపై ఎన్నో ఏళ్లుగా రూమర్స్ వస్తున్నా, ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా త్రిష ఏకంగా విజయ్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఈ పాటను పెట్టడం ద్వారా తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని, అంతకు మించి అని చెప్పకనే చెప్పినట్లయిందని విశ్లేషిస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్.

కారణం త్రిషతో ఉన్న ప్రేమాయణమే?

ఇక విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారని, దానికి కారణం త్రిషతో ఉన్న ప్రేమాయణమే అని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయ్ పబ్లిక్‌గా ఎక్కడా త్రిష గురించి మాట్లాడలేదు. కానీ పోలింగ్ రోజునే త్రిష ఈ రేంజ్‌లో స్పందించడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

మొత్తానికి త్రిష పెట్టిన ఈ పోస్ట్ కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్‌తో వైరల్ కావడంతో త్రిష విజయ్‌కు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అండ్ సపోర్ట్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ వదులుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.

చూడాలి మరి త్రిష ఇచ్చిన ఈ హింట్ TVKకి ఎలా కలిసి వస్తుందో!

ALSO READ :ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×