E-Paper
Advertisement

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?

హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్..?
Advertisement

Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: నాలుగు జిల్లాల చెత్తతో హుజూరాబాద్‌ భవిష్యత్తును బొందపెడతారా అని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి శివారులో సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఉమ్మడి జిల్లాల డంపింగ్‌ యార్డు స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు..

ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కొత్త సమస్యలను సృష్టించడం సరికాదన్నారు. నాలుగు జిల్లాల వ్యర్థాలను ఒకే చోట చేర్చడం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.

Advertisement

Also Read: బీఆరెస్ పార్టీలో చంద్ర‌బాబుపై చ‌ర్చ‌! కేటీఆర్ వ్యూహానికి కేసీఆర్ గండి!

రైతులకు తీరని అన్యాయం..

“విత్తన భాండాగారంగా పేరొందిన హుజూరాబాద్‌ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు తలపెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు చిచ్చు పెట్టడం వల్ల గత నెల రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.

పోరాటాన్ని ఉధృతం చేస్తాం..

Advertisement

డంపింగ్‌ యార్డుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరసనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని, తక్షణమే డంపింగ్‌ యార్డును రద్దు చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు తుర్పాటి రాజు, పారిపెల్లి కొండల్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు మొలుగురి సుమలత, పంజాల మనోజ్‌, దామర అనూష, తూర్పాటి లక్ష్మీదుర్గ, కొండ ప్రశాంతి, సర్పంచి ముప్పు మహేష్‌, సీనియర్‌ నాయకులు పైల్ల వెంకట్‌రెడ్డి, గంగిశెట్టి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమం.. 70శాతంకు పైగా కాలిన గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×