E-Paper
Advertisement

పిచ్చెక్కిస్తున్న రాఖీ సావంత్.. ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ ‘కుర్రాళ్ల’పై షాకింగ్ కామెంట్స్!

పిచ్చెక్కిస్తున్న రాఖీ సావంత్.. ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ ‘కుర్రాళ్ల’పై షాకింగ్ కామెంట్స్!
Advertisement

Rakhi Sawant : రాఖీ సావంత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా, కాంట్రవర్సీలకి కేరాఫ్ ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి సెన్సేషన్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అది కూడా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాపై. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న ఈ అమ్మడు, చక్కగా సంసారం చేసుకుంటున్న పీసీ (PC)ని కాంట్రవర్సీలోకి లాగడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

కుర్రాళ్లను బుట్టలో వేసుకోవడానికి  ప్రియాంక ని కాదు

Advertisement

ఒక ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ తన మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ “కుర్రాళ్లను బుట్టలో వేసుకోవడానికి నేనేమీ ప్రియాంక చోప్రాని కాదు. ఆమెలా సగం వయసున్న వాళ్లతో తిరగను. నాకు మెచ్యూర్డ్ మగాళ్లే కావాలి” అంటూ హాట్ కామెంట్స్ వదిలింది. నిజానికి తన వెనుక పదిహేనేళ్ల కుర్రాళ్లు కూడా పడుతున్నారు.. కానీ నాకు వాళ్లు అవసరం లేదు అని చెప్పే ప్రాసెస్‌లో ప్రియాంకలాగా కుర్రాడిని పెళ్లి చేసుకొని లోకాన్ని నమ్మించలేను అంటూ ప్రియాంక చోప్రాని మధ్యలోకి లాగేసింది.

అయితే ప్రియాంకను విమర్శించిన కాసేపటికే.. ఆమెను పొగడటం మొదలుపెట్టింది రాఖీ. “ప్రియాంక చాలా యంగ్‌గా ఉంటుంది, నిక్ జోనాస్ కంటే ఆమెనే చిన్నగా కనిపిస్తుంది” అంటూ PC ని కూల్ చేయడానికి తెగ ట్రై చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది.

Advertisement

గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడే రేంజ్ నీకుందా?”

ఇలా రాఖీ కామెంట్స్ బయటికి రాగానే రెచ్చిపోయారు నెటిజన్లు. రాఖీ సావంత్ తన పబ్లిసిటీ కోసం ఎవరినైనా వాడుకుంటుందని కొంతమంది అంటే “రాఖీ.. నీ సంసారాల సంగతి ఏంటి? ముందు అది చూసుకో!” అని కొందరు నెటిజన్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఇక మరికొంతమంది “గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడే రేంజ్ నీకుందా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్ పర్సనల్ డిసీషన్స్‌ని ఇలా విమర్శించడం నీకే చెల్లింది అంటూ చెడుగుడు ఆడటం మొదలెట్టారు ప్రియాంక ఫ్యాన్స్.

ALSO READ :శివాత్మిక రాజశేఖర్ ‘ఫ్రస్ట్రేషన్’.. ఫాలోవర్స్ లేరని ఏడుపా? లేక టాలెంట్ సరిపోవడం లేదా?

రాఖీ సావంత్ పెళ్ళిళ్ళు 

ఇక రాఖీ సావంత్ పెళ్లిళ్ల విషయానికి వస్తే 2019లో రితేష్ అనే ఎన్నారై (NRI) బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ అతడు ఎవరో ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే ‘బిగ్ బాస్ 15’ షోలోకి అతడిని తీసుకువచ్చి ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ, ఆ తర్వాత రితేష్‌కు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలియడంతో షాక్ తిన్న రాఖీ 2022లో విడాకులు ఇచ్చేసింది.

రితేష్‌తో విడిపోయిన కొన్నాళ్లకే మైసూర్‌కు చెందిన ఆదిల్ ఖాన్ దురానీతో ప్రేమాయణం మొదలెట్టింది రాఖీ. ఇక 2022 మే నెలలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. పైగా ఈ పెళ్లి కోసం రాఖీ తన పేరును ‘ఫాతిమా’గా మార్చుకుంది కూడా. అయితే 2023 మొదట్లో ఆదిల్ తనను మోసం చేశాడని, హెరాస్‌మెంట్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫలితంగా ఆదిల్ జైలు ఊచలు లెక్కెట్టాడు. ఇక చివరగా ఈ మధ్యే అక్టోబర్ 2025లో వీరిద్దరూ మ్యూచువల్‌గా డివోర్స్ తీసుకున్నారని సమాచారం.

డోడీ ఖాన్ అనే పాకిస్థానీ నటుడితో

ఇక గత రెండు పెళ్లిళ్ల సంగతి అలా ఉంటే తాజాగా డోడీ ఖాన్ అనే పాకిస్థానీ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నదని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

అయితే తన మూడో పెళ్లి వార్త కంటే ప్రియాంకపై చేసిన కామెంట్స్‌తోనే మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది రాఖీ. మరి నిత్యం సోషల్ మీడియాలో ఏడుపు పాట పాడే ఈ డ్రామా క్వీన్ చేస్తున్న ఈ రచ్చ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ALSO READ :ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×