E-Paper
Advertisement

Winter Tips: ఆవిరి పట్టడమే ప్రధాన సమస్యగా మారిందా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Winter Tips: ఆవిరి పట్టడమే ప్రధాన సమస్యగా మారిందా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Advertisement

Winter Tips: వింటర్ సీజన్‌లో జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చల్లని వాతావరణం వల్ల శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది తక్షణ ఉపశమనం కోసం తరచూ ఆవిరి పడుతుంటారు. అయితే సరైన విధానంలో ఆవిరి పడితే ముక్కు మార్గాలు సాఫీగా మారి, ఛాతీలో కూరుకుపోయిన కఫం తగ్గే అవకాశం ఉంటుంది.

కానీ ఆవిరి పట్టే సమయంలో కొందరు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. దాంతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే ఆవిరి పట్టడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? దాన్ని సరైన రీతిలో ఎలా చేయాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటున్నారంటే..

Advertisement

ఆవిరి పీల్చినప్పుడు వేడి ఆవిరి నేరుగా శ్వాస మార్గాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో ముక్కు దిబ్బడ, ఫ్లూ లక్షణాలు కొంతవరకు తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది శాశ్వత చికిత్స కాకపోయినా, లక్షణాలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: చలికాలంలో గడ్డ పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరమా?.. వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే!

స్టీమింగ్ చేసే మేలు:

Advertisement

స్టీమింగ్ వల్ల చర్మానికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, లోపల పేరుకుపోయిన మురికి, ధూళి బయటకు వచ్చేస్తాయి. శీతాకాలంలో చర్మం పొడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆవిరి పడితే చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడటంలో, చర్మానికి సహజమైన మెరుపు అందించడంలో కూడా స్టీమింగ్ చక్కగా పని చేస్తుంది.

తలనొప్పి, ఒత్తిడి నుంచి రిలీఫ్:

తరచూ తలనొప్పి లేదా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవారికి ఆవిరి పట్టడం కొంత రిలీఫ్ ఇస్తుంది. వేడి ఆవిరి శరీరాన్ని రిలాక్స్ చేయడంతో కండరాలు ఉత్తేజంగా మారుతాయి. దీని వల్ల ఒత్తిడి తగ్గి, నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆవిరి పట్టే సరైన పద్ధతి:

ఆవిరి పట్టాలంటే.. ముందుగా నీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ముక్కు ద్వారా నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. అయితే ఎక్కువసేపు చేయకుండా ఒక్కోసారి 2 నుంచి 5 నిమిషాల వరకు మాత్రమే చేయడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో, పరిమితంగా ఆవిరి పీల్చితే శీతాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read: శీతాకాలంలో డ్రై స్కిన్‌కు చెక్‌.. ఆముదంతో న్యాచురల్ గ్లో ఎలా తెచ్చుకోవాలంటే?

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×