Remedies For Saturday: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శనివారం శని దేవుడికి అంకితం చేయబడిన రోజు. శని దేవుడిని ‘కర్మ ఫల ప్రదాత’ అని పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు. శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించుకోవడానికి.. అదృష్టాన్ని పొందేందుకు శనివారం కొన్ని పనులు చేయడం, కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. శనివారం పాటించాల్సిన నియమాలు , పరిహారాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం రోజు ఏం చేయాలి?
శని దేవుడి ఆరాధన: శనివారం ఉదయాన్నే స్నానం చేసి శని దేవుడిని పూజించాలి. గుడికి వెళ్లి నల్ల నువ్వులతో నిండిన నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.
హనుమాన్ చాలీసా పఠనం: శని దేవుడు హనుమంతుడి భక్తులకు ఎప్పుడూ హాని చేయనని వరం ఇచ్చాడు. అందుకే శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది.
దానధర్మాలు: శని దేవుడికి దానం చేయడం అంటే చాలా ఇష్టం. పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి నల్లని దుస్తులు, నల్ల నువ్వులు, గొడుగు లేదా చెప్పులు దానం చేయడం శుభప్రదం.
పక్షులకు, జంతువులకు ఆహారం: నల్ల కుక్కకు ఆవనూనె రాసిన రోటీని తినిపించడం లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది.
నీలి రంగు దుస్తులు: శని దేవుడికి ఇష్టమైన రంగు నీలం లేదా నలుపు. ఈ రోజున నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.
శనివారం రోజున ఏమి చేయకూడదు?
శనివారం కొన్ని వస్తువులను కొనడం లేదా కొన్ని పనులు చేయడం వల్ల శని కోపానికి గురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.
ఇనుప వస్తువులు: శనివారం ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు. అయితే.. ఇనుప వస్తువులను దానం చేయడం మంచిది.
ఉప్పు కొనడం: శనివారం ఉప్పు కొనడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంట్లో దారిద్యాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు.
నూనె, నల్ల నువ్వులు: శని దేవుడికి నూనె సమర్పించడం మంచిదే కానీ, శనివారం నూనె కొనకూడదు. అలాగే నల్ల నువ్వులను కూడా శనివారం ఇంటికి తీసుకురాకూడదు.
మాంసాహారం మరియు మద్యం: శనివారం పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల శని దేవుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
పెద్దలను అవమానించడం: శని దేవుడు న్యాయాధికారి. ఎవరైతే వృద్ధులను, శ్రమజీవులను, అనాథలను అవమానిస్తారో వారిపై శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
శని దోష నివారణకు పరిహారాలు:
రావి చెట్టు పూజ: శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించి, చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల కష్టాలు తొలగుతాయి.
మంత్ర పఠనం: “ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శని దేవుడు కష్టపడే వారిని, నిజాయితీగా ఉండేవారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. కాబట్టి నియమాలను పాటిస్తూ.. ఇతరులకు సహాయం చేయడం అన్నింటికంటే పెద్ద పరిహారం.