E-Paper
Advertisement

Women’s Day 2026 Gift Ideas: మగువ మనసు గెలిచే కానుకలు, ఈ ఉమెన్స్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఐడియాస్!

Women’s Day 2026 Gift Ideas: మగువ మనసు గెలిచే కానుకలు, ఈ ఉమెన్స్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఐడియాస్!

Women’s Day 2026 Gift Ideas: మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు. మన ఎదుగుదలలో తోడున్న ప్రతి మహిళకు కృతజ్ఞత చాటుకునే అద్భుతమైన అవకాశం. ఒక చిన్న బహుమతి ఆమె ముఖంలో చిరునవ్వును, ఆమె పట్ల మీకున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదిలా ఉంటే చాలా మంది ఉమెన్స్ డే రోజు గిఫ్ట్స్ ఇస్తుంటారు. మరి మారుతున్న కాలంతో పాటు బహుమతుల ఎంపికలో కూడా కొత్త ట్రెండ్స్ వచ్చాయి. మరి ఈ ఉమెన్స్ డే కోసం  పర్సనలైజ్డ్ గిఫ్ట్స్, సెల్ఫ్-కేర్ కిట్స్, ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మహిళా దినోత్సవం 2026- గిఫ్ట్స్:

1. సెల్ఫ్-కేర్ , వెల్నెస్ హాంపర్స్ :
నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో జీవితంలో మహిళలకు తమ కోసం కేటాయించుకునే సమయం చాలా తక్కువ. అందుకే వారికి రిలాక్సేషన్ ఇచ్చే స్పా కిట్స్, సుగంధ పరిమళాల క్యాండిల్స్ , ఎసెన్షియల్ ఆయిల్స్ , స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్న హాంపర్స్ ఇవ్వడం గొప్ప ఐడియా. ఇవి “మీరు మాకు ముఖ్యం, మీ ఆరోగ్యం జాగ్రత్త” అనే మెసేజ్ ఇస్తాయి.

2. పర్సనలైజ్డ్ గిఫ్ట్స్:
ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతులు పర్సనలైజ్డ్ గిఫ్ట్స్. వారి పేరు చెక్కిన జ్యువెలరీ, ఫోటో మెమరీ బుక్స్, కస్టమైజ్డ్ కాఫీ మగ్స్ లేదా క్యారికేచర్ స్టాండ్స్ 2026లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంతే కాకుండా వారితో ఉన్న పాత జ్ఞాపకాలను ఒక ఫోటో ఫ్రేమ్‌గా మార్చి ఇస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం.

3.ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్:
ప్రస్తుతం ప్రకృతిని కాపాడు కోవాలనే స్పృహ అందరిలో పెరుగుతోంది. పర్యావరణ హితమైన టోట్ బ్యాగ్స్, వెదురు తో చేసిన బాటిల్స్, ఇండోర్ ప్లాంట్స్ వంటివి బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యంగా ఆఫీసు లో పని చేసే మహిళలకు వారి డెస్క్ మీద ఉండే చిన్న మొక్కలు ప్రశాంతతను ఇస్తాయి. మొక్కలు చూడటానికి ఎంతో బాగుంటాయి కూడా.

4. డిజిటల్ ,స్మార్ట్ గ్యాడ్జెట్స్:
మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపే స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ బ్యాండ్స్ లేదా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నేటి కాలపు మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి. మహిళలు చదువుకోవడానికి ఇష్టపడితే ‘కిండిల్’వంటి ఈ-రీడర్స్ కూడా అద్భుతమైన గిఫ్టుల లిస్ట్టులో ఉంటాయి.

Also Read: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026.. చరిత్ర, ఈ ఏడాది ‘థీమ్’ ఇదే!

5. అనుభవాలను బహుమతిగా ఇవ్వండి:
వస్తువుల కంటే.. అనుభవాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి.కుటుంబంతో కలిసి ఒక డిన్నర్ డేట్, ఒక రోజంతా స్పా వోచర్, లేదా ఆమెకు ఇష్టమైన పెయింటింగ్ లేదా యోగా వర్క్‌షాప్ మెంబర్‌షిప్ వంటివి మహిళలకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అంతే కాకుండా ఇవి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి.

బహుమతి ఖరీదు కంటే.. దాని వెనక ఉన్న మీ ఆలోచన ముఖ్యం. ఒక చిన్న చేతి రాతతో కూడిన లెటర్ ఆ బహుమతికి అదనపు అందాన్ని ఇస్తుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని మీ జీవితంలోని స్త్రీ మూర్తులకు మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చండి.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×