E-Paper
Advertisement

TG Women Empowerment: మహిళల సంక్షేమం కోసం.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇవే..?

TG Women Empowerment: మహిళల సంక్షేమం కోసం.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇవే..?

TG Women Empowerment: స్వేచ్ఛ బ్యూరో: మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమం, స్వయం ఉపాధి, సామాజిక భద్రత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తోంది. అంబేద్కర్ సూచించిన‘ఆడబిడ్డల అభివృద్ధే సమాజ అభివృద్ధి’ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరచే దిశగా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.

మహిళా దినోత్సవం

‘మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో మహిళలకు ఆర్థిక చేయూత, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉచిత బస్సు ప్రయాణం నుంచి కోట్ల రూపాయల బ్యాంకు రుణాల వరకు, స్వయం ఉపాధి నుంచి మహిళా వ్యాపార ప్రోత్సాహం వరకు, సంక్షేమం నుంచి స్వావలంబన వరకు అనేక పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువస్తోంది. కుటుంబానికి మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే శక్తిగా మహిళలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో మహిళా సాధికారతలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా దినోత్సవంను పురస్కరించి మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.

ఇందిరమ్మ యునిఫాం చీరలతో..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ అధికారంలోకి అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ స్కీం ను ప్రారంభం. సగటున ప్రతి రోజు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం. కనీసం ఒక్కో మహిళకు నెలకు 5 వేల రూపాయలను ఆదా అవుతున్నాయి. ఈ మొత్తం ఆ కుటుంబ ఖర్చులకు వినియోగించుకుంటుండటంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతోంది. పట్టణ, గ్రామం తేడా లేకుండా మహిళలంతా ఒకే గొడుగు కిందకు తెచ్చి, సంఘటిత శక్తిగా మార్చడం. ఉక్కు మహిళ ఇందిరమ్మ అంత బలంగా తెలంగాణలోని ప్రతి మహిళను తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళా సంఘటిత శక్తిగా, ఒక ఉద్యమంగా ఇందిరా మహిళా శక్తి ఎదుగుతోంది. ఇందిరమ్మ యునిఫాం చీరలతో మహిళలు తమ ఐక్యతను చాటుతున్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అదే విధంగా కోటి మంది మహిళలకు కోటి చీరలను ప్రతి ఏడాది పంపిణీకి శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచితంగా బస్సు, కారు, త్రి వీలర్, టూ వీలర్ శిక్షణ. త్వరలో ఆర్డీసీ డ్రైవర్లుగా మహిళలకు అవకాశం. ఇప్పటికే పలువురు శిక్షణ పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: BRS Party: ఈ నెల 10న బీఆర్ఎస్ వర్క్ షాప్‌.. ప్రత్యేకంగా ఈ అంశాల పైనే స్పెషల్ ఫోకస్..?

వడ్డీ లేని రుణాలు

రాష్ట్రవ్యాప్తంగా 46.68 లక్షల గ్రామీణ పేద మహిళలను 4.37 లక్షల స్వయం సహాయక సంఘాలుగా సమీకరించింది. ఈ సంఘాలను 18 వేల గ్రామ సంస్థలు, 553 మండల మహిళా సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు, 4 మహా సమాఖ్యలుగా విస్తరించి బలమైన సంస్థాగత వ్యవస్థల నిర్మాణం. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవన నిర్మాణానికి శ్రీకారం. ఇది మహిళ సంఘటిత శక్తికి, ఆర్దిక కార్యకలాపాలకు వేదికగా నిలవనుంది. అదే విధంగా ప్రజా ప్రభుత్వంలో ఎస్హెచ్జీలకు ఇప్పటి వరకు₹36 వేల కోట్ల బ్యాంకు రుణాలు. వారిని భవిష్యత్తు పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లలో వడ్డీ లేని రుణాలు పథకం కింద మహిళా సంఘాలకు ₹1,121 కోట్ల వడ్డీ లు మా ప్రభుత్వం చెల్లించి వడ్డీ భారం లేకుండా చేసినట్లు ప్రభుత్వం వెల్లడి. ఒక్కో సంఘానికి సగటు రుణం 2014-15లో ₹1.90 లక్షలుండగా, 2025-26లో ₹9.55 లక్షలకు పెరగడం ప్రగతికి సూచికగా ప్రకటించింది.

ఆర్దిక స్వావలంభన దిశలో..

₹3,612 కోట్ల పెట్టుబడితో రాష్ట్రవ్యాప్తంగా 2.05 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లు స్థాపన. కుటుంబాలు కూలిపోకూడదని, ఆర్దికంగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి సభ్యురాలికి ₹2 లక్షల వరకు రుణ బీమా. ₹10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం. దీంతో మహిళలకు సామాజిక భద్రత కల్పన. 231 మందికి ప్రమాద బీమా, 2993 మందికి లోన్ బీమా వర్తింపు చేసిమహిళ సంఘాల కుటుంబాలకు రూ. 45 కోట్లను అందజేసినట్లు ప్రభుత్వం వెల్లడి. ఆర్దిక స్వావలంభన దిశలో వినూత్న వ్యాపారాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇందిరా మహిళా శక్తి బజార్..

మండల మహిళా సమాఖ్యలు ₹216 కోట్ల పెట్టుబడితో 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి, ఒక్కో బస్సుపై నెలకు సగటున ₹70,000 ఆదాయం పొందుతున్నారు. మొత్తం నెలవారిఅద్దె ₹4.16కోట్లు 600 మండల సమాఖ్యలకు అందుతోంది. 230 ఇందిరమ్మ క్యాంటీన్లు నెలకు సగటున ₹72,000 లాభం ఆర్జిస్తున్నాయి.హైదరాబాద్ ఐటీ హబ్ మధ్యలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి బజార్”లో106 దుకాణాల ద్వారా గ్రామీణ మహిళా వ్యాపారులను పట్టణ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసింది.65 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు 30 రకాల పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రోఫైల్స్ సిద్దం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Fire Accident: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాప్ పూర్తిగా దగ్ధం

రూ.4 నుంచి 5 లక్షలు

2024–25లో 29,680 ఎస్హెచ్జీ మహిళలు 37.58 లక్షల పాఠశాల యూనిఫామ్‌లు కుట్టి ₹28.09 కోట్ల ఆదాయం పొందారు.గ్రామ సంస్థలు 2,960 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించి ఎస్హెచ్జీ లకు సంవత్సరానికి సుమారు ₹60 కోట్ల కమిషన్ ఆదాయం అందించాయి.జిల్లా స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల హబ్‌లుగా 22 “ఇందిరా మహిళా శక్తి భవనాలు” నిర్మాణంలో ఉన్నాయి. మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంక్ నిర్వహణ వంటి కొత్త రంగాల్లో అడుగుపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ ప్రతి నెల ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు, రూ.4 నుంచి 5 లక్షలు సంపాదించగలుగుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కృషి ఫలితంగా 4 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.

తమ కాళ్లపై తాము నిలబడేలా..

‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కింద ₹510 కోట్ల విలువైన 27,303 పాఠశాల మౌలిక వసతుల పనులు పూర్తి చేశారు.టీనేజీ బాలికలు 6139 సంఘాలు, వృద్ధ మహిళలు 7677 సంఘాలు- 74,772 మహిళలు, దివ్యాంగుల 11, 450 సంఘాలు -72,979 సభ్యులతో ప్రత్యేక ఎస్హెచ్జీలు ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుంది. గృహ హింస కారణంగా ఒంటరిగా మారిన మహిళలకు అండగా నిలుస్తూ, వారికి నైపుణ్య శిక్షణ అందించి బ్యాంకింగ్ రుణాలు కల్పించడం ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేసి, తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అభివృద్ది చెందిన దేశాల్లో జీడీపీలో మహిళల భాగస్వామ్యం 40 శాతం ఉంది. అదే అభివృద్ది చెందుతున్న దేశాల్లో అది 18 శాతమే ఉంటుంది. అయితే ప్రజాప్రభుత్వం కుటుంబ బాధ్యతను, పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు, క్రెష్సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వలస కూలీల పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు మోబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పనిచేసే ప్రాంతాలకే రేషన్ సప్లై చేయబోతున్నట్లు వెల్లడించింది. పోషకాహార లోపంతో ఎక్కువగా భాదపడేది మహిళలు, కౌమార బాలికలు, చిన్నారులు. అందుకే ఆరోగ్య, బలమైన తెలంగాణ నిర్మాణం కోసంపోషకాహర పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. ప్రతి చిన్నారికి, గర్భిణి, బాలింతలకు10‌‌0 ఎం ఎల్ మిల్క్ సరఫరా చేస్తున్నామని పేర్కొంది.అదే విధంగా చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీంను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: BRS Rivalry: సోషల్ మీడియాలో.. బావ బామ్మర్దుల పోటాపోటీ ట్వీట్లు!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×