E-Paper
Advertisement

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026.. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026.. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా?
Advertisement

World Health Day 2026: ప్రతి ఏటా ఏప్రిల్ 7వ తేదీ వచ్చిందంటే అది కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు. మన బాడీని ‘రీస్టార్ట్ ‘ చేసుకోవాల్సిన టైమ్. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పురుడు పోసుకున్న అపురూప సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ .. జరుపుకునే ఈ ‘వరల్డ్ హెల్త్ డే’.. అందరికీ నాణ్యమైన వైద్యం అందాలనే గ్లోబల్ మిషన్‌తో సాగుతోంది. అయితే.. 2026లో మనం ఎదుర్కొంటున్న కొత్త రకమైన ‘డిజిటల్ , లైఫ్ స్టైల్’ వ్యాధుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో.. ఈ ఏడాది థీమ్, హెల్త్ సీక్రెట్స్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు..ఒక ‘సర్వైవల్ మంత్రం. ఉరుకుల పరుగుల జీవితంలో చికిత్స కంటే.. నివారణ’ మిన్న అనే పాత సామెతను పాటిస్తూ..మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 ప్రాముఖ్యత:

Advertisement

ప్రస్తుత ప్రపంచంలో వాయు కాలుష్యం, మానసిక ఒత్తిడి, ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె పోటు వంటి సమస్యలు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలను, ప్రజలను సన్నద్ధం చేస్తుంది. కేవలం చికిత్స కంటే ‘నివారణ’మిన్న అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతుంది.

2026 థీమ్:
ప్రతి సంవత్సరం WHO ఒక నిర్దిష్టమైన థీమ్‌ను ప్రకటిస్తుంది. 2026 సంవత్సరానికి గానూ “Health for All: Building a Resilient Future” (అందరికీ ఆరోగ్యం: దృఢమైన భవిష్యత్తు దిశగా) అనే అంశంపై దృష్టి సారించారు. అంటే..అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో, కూడా ప్రతి సామాన్యుడికి వైద్యం అందాలని.. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని దీని అర్థం.

Advertisement

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం 5 కీలక చిట్కాలు:
ఆరోగ్యంగా ఉండటం అంటే కఠినమైన నియమాలు పాటించడం కాదు, మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం.

1.సమతుల్య ఆహారం:
మీ ప్లేట్‌లో సగం భాగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. తృణ ధాన్యాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పంచదార, ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

2.క్రమం తప్పని వ్యాయామం:
రోజుకు కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా.. శరీరంలో సానుకూల హార్మోన్లను విడుదల చేస్తుంది.

Also Read: ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల శుద్ధి.. మీ కుటుంబ ఆరోగ్యానికి భరోసా

3. మానసిక ఆరోగ్యం :
శారీరక ఆరోగ్యంతో.. పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. ధ్యానం చేయడం, తగినంత నిద్ర (7-8 గంటలు) పోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. డిజిటల్ స్క్రీన్ల వాడకాన్ని తగ్గించి, ప్రకృతితో.. సమయం గడపడం అలవాటు చేసుకోండి.

4.నీరు, హైడ్రేషన్:
రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. నీరు శరీరంలోని.. విష తుల్యాలను బయటకు పంపి, చర్మాన్ని, అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

5.క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షలు:
వ్యాధి వచ్చాక బాధపడటం కంటే.. రాక ముందే గుర్తించడం ముఖ్యం. ఏడాదికి ఒకసారి పూర్తి హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల లోపల పెరుగుతున్న సమస్యలను ప్రాథమిక దశలోనే అరి కట్టవచ్చు.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×