E-Paper
Advertisement

Curd Hair Mask: పెరుగుతో దృఢమైన మెరిసిపోయే జుట్టు.. ఖర్చులేకుండా స్పెషల్ హెయిర్ మాస్క్.. ఇలా అప్లై చేయండి

Curd Hair Mask: పెరుగుతో దృఢమైన మెరిసిపోయే జుట్టు.. ఖర్చులేకుండా స్పెషల్ హెయిర్ మాస్క్.. ఇలా అప్లై చేయండి
Advertisement

Curd Hair Mask| ఈ రోజుల్లో మంచి హెయిర్ స్టైల్ కావాలని, తమ జుట్టు మెరిసిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ నిజజీవితంలో చాలా మంది పోడిబారిన జుట్టు, బలహీన పేలవమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు కారణం.. పోషకాహార లోపం, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు ఊడటం, ఎండిపోవడం, పొడిబారిపోవడం, తలలో గజ్జి వంటి సమస్యలు సాధారణమవుతున్నాయి. హార్మోన్ల మార్పులు కూడా జుట్టుని బలహీనపరుస్తాయి.

అందుకే త్వరగా పరిష్కారాల కోసం అందరూ మార్కెట్లో లభించే కెమికల్ షాంపూ, కండీషనర్లు, భారీ రసాయనాల హెయిర్ మాస్క్‌లను వినియోగిస్తారు. కానీ అవి కొన్నిసార్లు సమస్యను మరింత పెంచేస్తాయి. ఈ కారణాలతో ఇప్పుడు చాలా మంది నివారణ కోసం ప్రక‌ృతిసిద్దహైన ఇంటి చిట్కాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందరి ఇళ్లలో లభించే పెరుగు ఈ సమస్యకు మంచి పరిష్కారం. చాలా సంవత్సరాలుగా జుట్టు సంరక్షణ కోసం భారతీయులు దీన్ని ఉపయోగిస్తున్నారు.

పెరుగు జుట్టుకు ఎందుకు మంచిది?

Advertisement

పెరుగులో జుట్టు ఆరోగ్యానికి సహాయపడే పోషకాలు ఉన్నాయి. ఇది తలపైనా, జుట్టు తీగలకు కూడా మంచిది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. జుట్టు ఊడటం తగ్గిపోతుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పెరుగు జుట్టుని బాగా శుభ్రం చేసి, ధూళి, మృత చర్మ కణాలను తొలగిస్తుంది. దీంతో కుదుళ్లలోని చర్మ రంధ్రాలు తెరిచి జుట్టుని పెరగడంతో సాయపడుతుంది. పెరుగులోని ప్రోటీన్ జుట్టును బలపరుస్తుంది. క్రమం తప్పకుండా వినియోగిస్తే.. జుట్టు మెత్తగా, మెరుస్తూ ఉంటుంది.

జుట్టపై పెరుగును ఎలా ఉపయోగించాలి?

సరైన విధంగా వినియోగిస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. పెరుగు ఫేస్ ప్యాక్ ఉపయోగించడానికి ఈ సులభమైన దశలు అనుసరించండి.

  • ముందు తాజా పెరుగు తీసుకోండి. పుల్లగా ఉండకూడదు.
  • పెరుగును బాగా కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేయండి.
  • జుట్టు క్లీన్ చేసి ఉండాలి. ఆ తరువాత దీన్ని నేరుగా తలపైనా, జుట్టు వేర్లపైనా పూయండి. తల మొత్తం పెరుగుని అంతా సమానంగా వ్యాపింపజేయాలి.
  • అదనపు తేమ కోసం ఒక టీస్పూన్ తేనె కలపవచ్చు. రెండు మూడు చుక్కల నిమ్మరసం కూడా వేయవచ్చు.
  • ఈ పేస్ట్‌ని జుట్టుపై 20 నుంచి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత ఏడైన సాఫ్ట్ షాంపూతో జుట్టు వాష్ చేయండి.
  • వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పద్ధతిని రిపీట్ చేయండి. క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నెమ్మదిగా మెరుగుపడుతుంది.

పెరుగు ఉపయోగించడం వల్ల ఏ లాభాలు ఆశించవచ్చు?

Advertisement

జుట్టు ఎండిపోతుంటే ఈ సమస్యను పెరుగు తగ్గించి, తేమను పెంచుతుంది. జుట్టు మెత్తగా, సున్నితంగా మారుతుంది. దీంతో జుట్టు చిక్కుముడిలేకుండా ఈజీగా దువ్వడానికి వీలవుతుంది. అంతేకాదు తలపైని గజ్జి ఉంటే మృదువుతగా శుభ్రం చేస్తుంది. బలమైన కుదుళ్ల వల్ల జుట్టు ఊడటం క్రమంగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే.. జుట్టు మెరుగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Also Read: మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

పెరుగు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి

పెరుగు హెయిర్ ప్యాక్ ఉపయోగించేముందు మీకు అలర్జీ ఉందా లేదా అని చెక్ చేయండి. ముందు చర్మంపై పాచ్ టెస్ట్ చేయండి. పుల్లగా ఉన్న పెరుగు తలపై వాడకండి. అది చికాకు కలిగించవచ్చు. ఫ్రెష్ పెరుగు మాత్రమే ఉపయోగించాలి. పాల ఉత్పత్తులకు అలర్జీ ఉన్నవారు పెరుగు హెయిర్ మాస్క్ అసలు ఉపయోగించకూడదు. ఏమైనా సందేహం ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి. జుట్టు ఊడటం కొనసాగితే డాక్టర్ సలహా తీసుకోండి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

పెరుగు ఒక ప్రాకృతిక, సహజ జుట్టు సంరక్షణ పదార్థం. క్రమం తప్పకుండా వినియోగిస్తే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన విధంగా అప్లై చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి ఉపయోగించండి. అప్పుడు బలమైన, మెరుగైన జుట్టు పొందవచ్చు.

ముఖ్య గమనిక: ఈ కథనంలో ఉన్నది సాధారణ  సమాచారం. పెరుగు మాస్క్ వినియోగించినా సమస్య కొనసాగితే చర్మ వైద్యులను సంప్రదించాలి.  పెరుగుతో అన్ని జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయిన ‘బిగ్ టీవి’ దావా చేయదు.

Related News

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

Big Stories

Advertisement
×