E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసేందుకు రాజు రెడీ

Brahmamudi Serial Today Episode April 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్ చేసేందుకు రాజు రెడీ
Advertisement

Brahmamudi serial today Episode: రాజు ఇంటికి వచ్చిన సాహుతో వాళ్ల నాన్న వెటకారంగా మాట్లాడుతుంటే.. రాజు, లక్కీ భయపడుతుంటారు. ఒక తండ్రిలా చెప్తున్నాను మా వాడితో పెట్టుకోకు నిన్ను అర్ధరూపాయికే అమ్మేస్తాడు అని చెప్పగానే.. సాహు మాత్రం పర్వాలేదు అంకుల్‌ మీ వాడి మీద నాకు నమ్మకం ఉంది అంటాడు. దీంతో ఇంత చెప్పినా నువ్వు వినకపోతే ఎలా రేపు పొద్దున్న వచ్చి ఏదైనా జరిగింది అంటూ బాధపడితే బాగుండదు అని చెప్తాడు. ఇంతలో వెంకీ దెబ్బలతో ఇంటికి వస్తాడు. వెంకీని చూసిన అందరూ షాక్‌ అవుతారు. రాజు కంగారుగా అరేయ్‌ ఏమైందిరా ఈ దెబ్బలేంటి..? ఎలా తగిలాయి.. అని అడగ్గానే..

ఏమో అన్నయ్యా రోడ్డు మీద బైక్‌ దగ్గర నిలబడి ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను ఎవడో కారుతో ఫాస్ట్‌గా వచ్చి అలా తగిలించి వెళ్లాడు. కొద్దిలో మిస్‌ అయింది. కానీ అది ఎవరో కావాలని చేసినట్టు ఉంది అంటాడు. దీంతో వాళ్ల అమ్మ కోపంగా నువ్వైనా చూసుకోవాలి కదరా..? అంటుంది. రాజు పెద్ద గాయాలేం చేయలేదు కదా ఒకసారి చూడనివ్వు.. అంటూ చూస్తుంటే.. వెంకట్ ఆశ్చర్యంగా నువ్వేంటి అన్నయ్య ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌ చేసేవాడివి ఇలా చూస్తున్నావు అని అడగ్గానే.. సాహు అన్నదమ్ముళ్ల లవ్‌ అలాగే ఉంటుంది బ్రదర్‌ ఎప్పుడూ గొడవలు పడుతున్నటే ఉంటారు కానీ కష్టం వచ్చిందంటే ఇలా కంగారు పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ బ్లడ్‌లో ఉన్న లవ్‌ అలాంటిది అంటూ రాజును బయటకు తీసుకెళ్లి ఆ యాక్సిడెంట్‌  తనే చేయించానని చెప్పి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు సాహు.

Advertisement

సాహు వెళ్లిపోయాక రాజు ఆలోచించి ఒరేయ్‌ ఆ ఐశ్వర్యకు ఫోన్‌ చేయ్‌ అని చెప్పగానే.. లక్కీ షాక్‌ అవుతాడు. రేయ్‌ అదేమన్నా లాలీపప్ప అడిగింది అనుకుంటున్నావా..? కిడ్నాప్‌ చేయమని అడిగిందిరా అనగానే.. రాజు కిడ్నాప్‌ మాత్రమే కాదు ఏం చేయడానికైనా నేను రెడీ ఉన్నాను అని చెప్పగానే.. లక్కీ రేయ్‌ ఏం అంటున్నావురా..? అనగానే.. రాజు అవున్రా ఇన్ని రోజులు మనం తప్పులు మోసాలు చేసినా.. అది మన వరకే ఉండేది. కానీ అది ఈరోజు తమ్ముడి వరకు వచ్చింది. రేపు అమ్మనాన్నల వరకు వస్తుంది. అలా జరగకూడదురా..? నేను ఏ రోజు ఈ ఇంటికి ఏమీ చేయలేదు వెంకీ గాడే నా స్థానంలో ఉండి అమ్మానాన్నలను ఈ ఇంటిని చూసుకుంటున్నాడు. నా వల్ల వాళ్లకు ఏదైనా జరిగితే నేను జీవితాంతం క్షమించుకోలేను.. నా కుటుంబం కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ముందు ఫోన్‌ చేయ్‌ కలుద్దాం అని చెప్పు అనగానే.. లక్కీ సరే అంటూ కాల్‌ చేస్తాడు.

తర్వాత ఐశ్వర్య, లక్కీ, రాజులను కలవడానికి వస్తుంది. ఇంతలో ఎందుకు మనసు మార్చుకున్నారు అని అడుగుతుంటే రాజు కోపంగా ఇవన్నీ నీకు అవసరం లేదు ముందు ఎవరిని కిడ్నాప్‌ చేయాలో చెప్పు అనగానే.. ఐశ్వర్య, ఇందు ఫోటో చూపిస్తుంది. ఇందును చూసిన రాజు లక్కీ షాక్‌ అవుతారు. ఈ అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే ఏం వస్తాయి అని అడుగుతారు. దీంతో ఇందు సంతకం చేస్తే కోట్లు వస్తాయని మా ఆంటీ చెప్తుంది. అందుకే ఈ అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే మా ఆంటీ మనకు అడిగినంత డబ్బు ఇస్తుంది అని చెప్పగానే.. ఇద్దరూ షాక్‌ అవుతారు. రాజు, లక్కీ కిడ్నాప్‌కు రెడీ అంటారు.

Advertisement

మరోవైపు కిచెన్‌లోకి వెళ్లిన ఇందును భ్రమరాంబ, భూషన్‌ ఎందుకు వెళ్లావని వెళ్లొద్దని చెప్తారు. అప్పుడే వచ్చిన ఐశ్వర్య రేపటి కోసం బాగానే రెడీ అవుతున్నారేంటి అంకుల్‌ అంటూ రేపటి నుంచి అవకాశం వస్తుందో లేదో నాకో కాఫీ ఇవ్వవా అని అడగ్గానే.. ఇందు కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే రేఖ వచ్చి ఇందుకు ఎవ్వరూ పని చేయోద్దని ఈరోజు ఇందు చాలా ప్రశాంతంగా ఉండాలి. రేపు అందరం కలిసి ఫామ్‌హౌస్‌కు వెళ్తుంటే అందరి ముందు బుట్టబొమ్మలా కనిపించాలి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తుంది రేఖ.

రూంలోకి వెల్లిన ఇందును అపర్ణ వెళ్లి కోప్పడుతుంది. ఇంత జరుగుతుంటే నువ్వు ఏమీ అనవా..? అని అడగ్గానే.. దీన్ని ఆపడానికి ఏదో ఒక రూపంలో ఆ దేవుడు నాకు సాయం చేస్తాడు అని చెప్తుంది ఇందు. కట్‌ చేస్తే ఇందును ఎలా కిడ్నాప్‌ చేయాలో అని లక్కీ, రాజు ఆలోచిస్తుంటారు. అప్పుడే ఐశ్వర్య ఫోన్‌ చేసి రేపు ఇందును ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తుంది రేఖ అని చెప్పగానే.. అక్కడి నుంచే ఇందును ఎత్తుకెళ్లిపోతామని చెప్తాడు రాజు. మరోవైపు అపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటారు. ఇక ఇందు రేపు ఏం చేస్తుందో ఏంటో అని బాధపడుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×