E-Paper
Advertisement

కోలీవుడ్‌లో లీకుల కలకలం.. ‘జైలర్ 2’ సీన్లు అవుట్.. రజనీ ఫ్యాన్స్‌ షాక్… రంగంలోకి దిగిన సన్ పిక్చర్స్!

కోలీవుడ్‌లో లీకుల కలకలం.. ‘జైలర్ 2’ సీన్లు అవుట్.. రజనీ ఫ్యాన్స్‌ షాక్… రంగంలోకి దిగిన సన్ పిక్చర్స్!

Jailer 2:‘కాదేసినిమా లీకులకు కనర్హం’ అంటూ రెచ్చిపోతున్నారు లీక్ వీరులు. అవును… కొన్ని రోజుల క్రితమే విజయ్ ‘జననాయగన్’ సినిమా పైరసీ బారిన పడగా, తాజాగా ఇదే బాటలో నడుస్తోంది ‘జైలర్ 2’ సినిమా. నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఒక మెయిన్ సీన్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంతో మేకర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే

దీంతో అలర్ట్ అయిన ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ సీరియస్‌గా రియాక్ట్ అయింది. తమ యాంటీ పైరసీ టీమ్ కంటిన్యూగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను అబ్జర్వ్ చేస్తుందని, ఎవరైనా లీకైన సినిమా కంటెంట్‌ని షేర్ చేసినా, ప్రమోట్ చేసినా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా లీగల్ యాక్షన్ మాత్రమే కాకుండా వాళ్ల వాళ్ల అకౌంట్స్‌ని పర్మినెంట్‌గా బ్లాక్ చేస్తామని కూడా తేల్చి చెప్పింది.

మొన్న ‘జననాయగన్’, నేడు ‘జైలర్ 2’

ఏది ఏమైనా ఇలా స్టార్ హీరోల సినిమాల క్లిప్పింగ్స్ వరుసగా లీక్ అవుతుండటం ఇప్పుడు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. మొన్న ‘జననాయగన్’, నేడు ‘జైలర్ 2’… ఇలా సెట్స్‌లో మొబైల్ ఫోన్లు నిషేధించినా కూడా వీడియోలు ఎలా బయటకు వస్తున్నాయనేది మిస్టరీగా మారింది. టెక్నికల్ టీమ్ నుండి ఎవరైనా వీటిని లీక్ చేస్తున్నారా? లేక బయటి వ్యక్తుల పనా? అనే కోణంలో విచారణ కొనసాగుతోందని సమాచారం.

also read:బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ పని క్లోజ్ ? ఈ బయోపిక్ హిట్ అవ్వకపోతే రిటైర్మెంట్ ఖాయమా?

‘వారసుడు’, ‘లియో’ చిత్రాల షూటింగ్ వీడియోలు

నిజానికి ఇలాంటి లీకుల బెడద కోలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. గతంలో దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’, ‘లియో’ చిత్రాల షూటింగ్ వీడియోలు కూడా ఇలాగే బయటకు వచ్చి మేకర్స్‌ని ఇబ్బంది పెట్టాయి. ఇక కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, అజిత్ ‘తునివు’, సూర్య ‘కంగువ’ వంటి భారీ బడ్జెట్ సినిమాల నుండి ఫోటోలు, మేకింగ్ వీడియోలు అంటూ అడపా దడపా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. భారీ బడ్జెట్లతో ఆడియన్స్‌కు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని హీరోలు సినిమాలు చేస్తుంటే, కొందరు ఓవర్ యాంగ్జైటీతో ఇలా సినిమాని ముక్కలు ముక్కలుగా లీకులు చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఎలా నిలబడుతుందనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

పవన్ ఈ సినిమాలో తన పవర్ చూపిస్తాడా

ఇక ‘జైలర్ 2’ సినిమా విషయానికి వస్తే… రజినీకాంత్ హీరోగా, రమ్యకృష్ణ, యోగి బాబుతో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు తలైవా ఫ్యాన్స్. అయితే ఈ సినిమా క్యామియోల విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అందరూ డైలమాలో పడిపోయారు. షారుక్ నటిస్తాడని, కాదు బాలయ్య మురిపిస్తాడని, అసలు వీళ్ళెవరు కాదు పవన్ ఈ సినిమాలో తన పవర్ చూపిస్తాడని… ఇలా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు చక్కర్లు కొడుతున్నా మేకర్స్ మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

చూడాలి మరి క్యామియోల వేటలో ఉన్న మన జైలర్ గారు అన్నట్టుగా జూన్ 12న రిలీజ్ అవుతారా లేక మరికొన్ని రోజులు సమయం తీసుకుంటారా!

also read:చిరాగ్ పాశ్వాన్‌తో ఎఫైర్? ‘పిల్లలు పుట్టేవాళ్లు’ అంటూ కంగనా షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియా షేక్!

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×