E-Paper
Advertisement

రొమాంటిక్ సీన్స్ పై ఇంటింటి రామాయణం అవని కామెంట్స్…చాలా సీరియల్స్ మిస్ చేసుకున్నా అంటూ!

రొమాంటిక్ సీన్స్ పై ఇంటింటి రామాయణం అవని కామెంట్స్…చాలా సీరియల్స్ మిస్ చేసుకున్నా అంటూ!
Advertisement

Intinti Ramayanam Avani: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటిగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీరియల్ నటి పల్లవి రామిశెట్టి(Pallavi Rami Setty) ఒకరు. ఈమె ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ముఖ్యంగా భార్యామణి అనే సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న పల్లవి ఏకంగా నంది అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీలో భార్యామణి, ఆడదే ఆధారం, అత్తారింటికి దారేది, వసుంధర వంటి సూపర్ హిట్ సీరియల్స్ చేశారు. ప్రస్తుత ఈటీవీకి దూరమైన ఈమె స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం(Intinti Ramayanam) సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఆ విషయంలో బోర్డర్ క్రాస్ చేయను..

ఈ సీరియల్ లో అవని అనే పాత్రలో పల్లవి అద్భుతమైన నటనను కనబరుస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి రామిశెట్టి సీరియల్స్ లో నటించడం గురించి ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పల్లవి రామిశెట్టి సీరియల్స్ లో ఇలాంటి పాత్రలకు కాస్త దూరంగా ఉంటారనే చెప్పాలి. ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ రొమాంటిక్ సీన్స్ చేయడంలో నాకంటూ ఒక బార్డర్ పెట్టుకున్నాను. ఆ బార్డర్ దాటి వెళ్ళనని తెలిపారు. సీరియల్ చూస్తున్నప్పుడు మనతోపాటు పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే రొమాంటిక్ సీన్ల విషయంలో నా బోర్డర్ ఎప్పుడు క్రాస్ చేయనని తెలిపారు. అవసరమైతే ఒక చిన్న పాపకు తల్లిగా నటించడానికి కూడా తాను సిద్ధమేనని తెలిపారు.

అలాంటి సీరియల్ అవకాశాలు రాలేదు..

Advertisement

ఇలా రొమాంటిక్ సీన్స్ చేయను అని చెప్పడం వల్ల ఏవైనా సీరియల్ అవకాశాలు తగ్గిపోయాయా అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు అవన్నీ సమాధానం చెబుతూ నేను ఎలాంటి పాత్రలు చేస్తాననే విషయం అందరికీ తెలుసు అందుకే రొమాంటిక్ సీన్లకు సంబంధించిన సీరియల్స్ అవకాశాలు ఇప్పటివరకు నా వరకు రాలేదని ఈమె తెలిపారు. ఇకపోతే ఇటీవల తెలుగు సీరియల్స్ లో ఇతర భాష హీరోయిన్లు ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిని తీసుకోవడానికి కారణం రొమాంటిక్ సీన్స్ కూడా కావచ్చా? అంటూ ప్రశ్న ఎదురైంది.

రెమ్యూనరేషన్ పై పల్లవి రామిశెట్టి కామెంట్స్..

Advertisement

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. తెలుగు వాళ్ళు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 8 వరకు మాత్రమే అంటూ కొన్ని టైమింగ్స్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. అయితే కొన్నిసార్లు పది, పదకొండు గంటల వరకు కూడా షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు వాళ్ళు చాలా వరకు ఒప్పుకోరు. అందుకే ఇతర భాష హీరోయిన్లను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా పల్లవి రామిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఇంత రెమ్యూనరేషన్ కావాలి అంటూ ఎక్కడ డిమాండ్ చేయలేదని, అయితే బయట సోషల్ మీడియాలో నా రెమ్యూనరేషన్ గురించి వచ్చే వార్తలు నిజం కాదని అంత ఎక్కువగా తానేమి తీసుకోనని చెప్పారే తప్ప ఎంత తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Also Read: నైటీ వేసుకుని షోకి రావచ్చు కదా… ఇంద్రజ పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×