E-Paper
Advertisement

బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ పని క్లోజ్ ? ఈ బయోపిక్ హిట్ అవ్వకపోతే రిటైర్మెంట్ ఖాయమా?

బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ పని క్లోజ్ ? ఈ బయోపిక్ హిట్ అవ్వకపోతే రిటైర్మెంట్ ఖాయమా?
Advertisement

Aamir Khan :అమీర్ ఖాన్.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందిన ఈ బాలీవుడ్ టాప్ స్టార్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా సక్సెస్ అడ్రస్ పట్టుకోలేకపోతున్న అమీర్ ఎలాగైనా హిట్టు కొట్టాలంటూ ఓ క్రేజీ పర్సన్ బయోపిక్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడట. యస్.. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ఫేమ్, భారత్ పే కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పై పండించేందుకు సిద్ధమైపోతున్నాడని బీ టౌన్లో వినిపిస్తున్న టాక్.

2018లో శాశ్వత్ నక్రానీతో కలిసి భారత్ పే సంస్థ

Advertisement

ఇక అష్నీర్ గ్రోవర్ విషయానికి వస్తే.. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షోతో బాగా పాపులర్ అయిన అష్నీర్ 2018లో శాశ్వత్ నక్రానీతో కలిసి భారత్ పే సంస్థను స్థాపించారు. ఇది ప్రవేశపెట్టింది  ఇంటరోపెరబుల్ QR కోడ్ .అంటే GPay, PhonePe, Paytm ఇలా ఏ యాప్ వాడుతున్నా ఒకే ఒక్క QR కోడ్ ద్వారా పేమెంట్ చేసెయ్యొచ్చు. అప్పట్లో ఒక్కో యాప్ కి ఒక్కో కోడ్ ఉన్న సమయంలో ఇలా ఒక్కటే కోడ్ తో పేమెంట్ చేసే అవకాశం రావడం, దానికి భారత్ పే ఎలాంటి కమీషన్ తీసుకోకపోవడంతో చిన్న చిన్న బిజినెస్‌లు చేసే వాళ్లకి ఒక వరంలా మారిందనే చెప్పాలి. అయితే దీని ద్వారా ఎలాంటి రిటర్న్స్ ఆశించకుండా, కోడ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్ ద్వారా వ్యాపారులకి లోన్స్ ఇవ్వడంతో భారత్ పే మంచి లాభాలనే చూసింది.

కంపెనీలో 2022 ప్రారంభం నుండి అల్లకల్లోలం

Advertisement

అయితే బాగా దూసుకుపోతున్న ఈ కంపెనీలో 2022 ప్రారంభం నుండి అల్లకల్లోలం మొదలైంది. అష్నీర్ గ్రోవర్ మరియు ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ కంపెనీ మనీని స్వంత ప్రయోజనాలకి వాడుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగిని అష్నీర్ దూషించారన్న ఆడియో క్లిప్ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఎట్టకేలకి ఇన్వెస్టిగేషన్ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అష్నీర్‌ను కంపెనీ నుండి సాగనంపారు. ఇక అప్పటి నుండి అవమాన భారంతో బయటికి వచ్చిన ఆయనకి, భారత్ పే మేనేజ్‌మెంట్‌కు మధ్య లీగల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది.

also read:రామ-లక్ష్మణులు వలస కూలీలా?ప్రకాష్ రాజ్ పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు…వారణాసికి బాయ్‌కాట్ సెగ!

అమీర్ అదే పుస్తకం ఆధారంగా సినిమా

ఈ క్రమంలోనే అష్నీర్ గ్రోవర్ ‘Doglapan: The Hard Truth about Life and Start-Ups’ అంటూ తన లైఫ్ స్టోరీని రాయగా, ఇప్పుడు అమీర్ అదే పుస్తకం ఆధారంగా సినిమా చేయాలని భావిస్తున్నాడట. అష్నీర్ లైఫ్ లో ఎలా ఎదిగాడు, ఎలా పడిపోయాడు వంటి అంశాల చుట్టూ కథని నడపబోతున్నాడని సమాచారం. అయితే ఇంకా ఎలాంటి పర్మిషన్ లేనటువంటి ఈ బయోపిక్ కి త్వరలో పర్మిషన్ తీసుకొని స్క్రిప్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకువెళ్తారని తెలుస్తోంది.

దంగల్’ తర్వాత ఆ స్థాయి హిట్ చూడని అమీర్ 

అమీర్ విషయానికే వస్తే.. 2016లో వచ్చిన ‘దంగల్’ తర్వాత ఆ స్థాయి హిట్ చూడలేదు అమీర్. 2018లో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ నుంచి 2022 నాటి ‘లాల్ సింగ్ చడ్డా’ వరకు అన్నీ ప్లాపులే. అయితే ‘తారే జమీన్ పర్’ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా టాక్ బాగున్నా వసూళ్ల దగ్గర బోల్తా పడటంతో అమీర్ ఖాన్ మార్కెట్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో దారుణంగా రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. మరో వైపు కాంపిటీటర్ అయిన షారుక్ ‘జవాన్’, ‘పటాన్’ అంటూ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న పరిస్థితి.

సో ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సాలిడ్ హిట్ కొట్టాలని ఇలా క్రేజీ బయోపిక్ ప్లాన్ చేశాడన్న మాట. చూడాలి మరి సెన్సేషన్ కి కేరాఫ్ అయిన ఈ బయోపిక్ బరువుని ఏ డైరెక్టర్ భుజాన వేసుకుంటాడో!

also read:దళపతి విజయ్ ‘జననాయగన్’ లీక్ మిస్టరీ వీడింది… ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×