E-Paper
Advertisement

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మహిళా బిల్లుపై చ‌ర్చ‌.. ప్రధాని మోదీ జాదూగర్ అంటూ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Rahul Gandhi: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వాడివేడిగా చ‌ర్చ‌ జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక దేశ రాజకీయ మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన జాదూగర్ (మెజీషియన్) వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా డీలిమిటేషన్‌తో లింక్ చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం దేశ భౌగోళిక సరిహద్దులను మార్చాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రత్యర్థి పార్టీల బలాన్ని తగ్గించారని విమర్శించారు. ఇదే పద్ధతిని జాతీయ స్థాయిలో అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కేవలం అధికారం కోసం రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయడం దేశ వ్యతిరేక చర్య.” అని ఆయన అభివర్ణించారు.

Advertisement

ఈ మొత్తం ప్రక్రియ వెనుక కులగణనను తప్పించుకునే ఉద్దేశం ఉందని రాహుల్ గాంధీ వాదించారు. ఓబీసీ, దళిత వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, ఇది రాజ్యాంగం కంటే మనువాదానికే ప్రాధాన్యత ఇవ్వడమేనని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కులగణన గురించి మాట్లాడుతున్నా, అది అసలు ప్రాతినిధ్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో స్పష్టత ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. రాబోయే 15 ఏళ్ల వరకు వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కకుండా చేసేందుకే ఈ ప్లాన్ అని ఆరోపించారు.

చర్చ మధ్యలో రాహుల్ గాంధీ కొంత చమత్కారాన్ని కూడా జోడించారు. తనకు, ప్రధాని మోదీకి “భార్య సమస్య” లేదని, అందుకే తాము తల్లులు, సోదరీమణుల సలహాలు ఎక్కువగా తీసుకుంటామని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి ఇంట్లో మహిళలు ఒక చోదక శక్తి అని, వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు.

Advertisement

మహిళా రిజర్వేషన్లపై మాట్లాడుతూ ప్రధాని మోదీని బాలాకోట్ మెజీషియన్ అని రాహుల్ సంబోధించడంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార పక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి అయిన ప్రధానిని అవమానించడం సరికాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని, రాహుల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

Read Also: మీ ఇంట్లోని ఆడబిడ్డలను గుర్తు తెచ్చుకోండి.. చరిత్ర సృష్టించేందుకు కలిసి రండి.. ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×