Peddi Collections: రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లోకి రావడం రావడమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్ప్రుష్టిస్తుంది.రంగస్థలం తర్వాత అంతటి రూటెడ్ విలేజ్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్.ఇక మేకర్స్ కూడా దానీ తగ్గట్టే పక్కా ప్లానింగ్ తో సినిమాని థియేటర్ లలోకి తీసుకొచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో బుచ్చిబాబు ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించగా, ఇప్పుడు చరణ్‌తో చేసిన ఈ రెండో ప్రయత్నం ఆయన రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లినట్టే కనిపిస్తుంది
చరణ్ సోలో కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్
ఇక థియేటర్లలో ఫెస్టివల్ మోడ్ ని మోసుకొచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.అవును ..మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 110 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూళ్లను సాధించిట్రేడ్ వర్గాలకి పెద్ద షాకే ఇచ్చింది.ఇక చరణ్ సోలో కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం ఇక్కడ మరో విశేషం. గతంలో మగధీర, రంగస్థలం వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచినప్పటికీ, ‘పెద్ది’ సాధించిన ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ మెగా పవర్ ఏంటో మరో సారి ప్రూవ్ చేసింది.
ఇక సినిమా సాలిడ్ సక్సెస్ కావడంతో మేకర్స్ ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ అంటూ ఒక క్రేజీ పోస్టర్‌ను అఫీషియల్ గా వదిలారు కూడా. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా, సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
హైక్వాలిటీ ప్రింట్ రూపంలో లీక్
అయితే ఇలా సాలిడ్ సక్సెస్ తో దూసుకుపోతున్న సమయంలో మూవీ టీమ్ కి పెద్ద షాకే తగిలింది. సినిమా విడుదలైన రెండో రోజే కొన్ని ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లలో ఈ చిత్రం హైక్వాలిటీ ప్రింట్ రూపంలో లీక్ అయ్యాయి.
మాములుగా థియేటర్ ప్రింట్లు రావడం చూస్తుంటాం కానీ, ఏకంగా డిజిటల్ క్వాలిటీకి సమానమైన హై క్వాలిటీ కాపీలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో, ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఇలా పైరసీ బారిన పడటం పెద్ద దెబ్బే అని చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో
ఇక సినిమా అలా రిలీజ్ అవ్వగానే ఇలా నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యేసరికి మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దని,ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డిజిటల్ యాంటీ పైరసీ టీమ్‌కు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు. చట్టవిరుద్ధంగా సినిమాను లీక్ చేసిన సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్‌తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ఎన్నో పెద్ద సినిమాలకు ఇలాంటి పైరసీ సమస్యలు ఎదురైనప్పటికీ, టెక్నాలజీ సాయంతో వాటిని అడ్డుకున్నారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా రంగంలోకి దిగి లింకులను తొలగించే పనిలో పడింది. ఈ పైరసీ భూతాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని, రాబోయే రోజుల్లో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో, ఏయే సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందో చూడాలి.
also read :సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?