E-Paper
Advertisement

రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్.. క్రేజీ కేమియోను కన్ఫర్మ్ చేసిన హృతిక్ రోషన్!

రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్.. క్రేజీ కేమియోను కన్ఫర్మ్ చేసిన హృతిక్ రోషన్!
Advertisement

Jailer 2 Cameo: సూపర్‌స్టార్ రజనీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ క్రేజీ సీక్వెల్‌లో ఒక పవర్‌ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయింది.

Read also-Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

Advertisement

గత కొన్ని వారాలుగా చిత్ర బృందంతో జరిగిన చర్చల అనంతరం హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పాత్ర అత్యంత కీలకంగా, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగనుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్ జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో జరగనుంది. షూటింగ్‌కు ముందే హృతిక్ రోషన్‌పై డిఫరెంట్ లుక్ టెస్ట్‌లు నిర్వహించి, ఒక సరికొత్త గెటప్‌ను లాక్ చేయనున్నారు.

40 ఏళ్ల తర్వాత..

హృతిక్ రోషన్, రజనీకాంత్ కాంబినేషన్‌కు ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ అనే హిందీ సినిమాలో రజనీకాంత్‌కు పెంపుడు కొడుకుగా బాలనటుడి పాత్రలో హృతిక్ నటించారు. ఆ తర్వాత మళ్లీ దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం విశేషం. ఈ కలయిక అటు నార్త్, ఇటు సౌత్ సినిమా లవర్స్‌కు ఒక ఐ-ఫీస్ట్‌గా మారనుంది.

Advertisement

Read also-“స్కూల్” అనే పదానికి అసలు అర్థం ఇదా?..తెలిస్తే పిల్లలు అస్సలు నమ్మరు!

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో ఎస్‌.జె. సూర్య, రమ్యకృష్ణ, విద్యాబాలన్, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ కేమియోలు సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లగా.. ఇప్పుడు ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ ఎంట్రీతో బిజినెస్ రేంజ్, హైప్ మరింత పెరిగాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×