E-Paper
Advertisement

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?
Advertisement

Nidhhi Agerwal Career:సినిమా ఇండస్ట్రీలో అందం ,అభినయం ఉంటే సరిపోదు ..అదృష్టం కూడా కలిసి రావాలి .ఇదిగో నిధి అగర్వాల్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది.ఎందుకంటే తనదైన అందం ,అభినయంతో సినిమాలు చేజిక్కుతున్నా ఒక్క సాలిడ్ సక్సెస్ కూడా ఖాతాలో వేసుకోలేకపోతుంది.

విషయంలోకి వస్తే బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్‌లోకి 2018లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో పరిచయమైంది.ఇక సినిమా బోల్తా కొట్టినప్పటికీ ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’లో ఛాన్స్ దక్కించుకుంది ,అయినా ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తో ఈ భామ పని అయిపోయిందని అనుకున్నారంతా.

Advertisement

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ డాక్టర్ సారా పాత్రలో కనిపించి అలరించింది.ఇక సినిమా మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో నిధికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమెకు ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి.

ఇక  ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తమిళంలో శింబు హీరోగా వచ్చిన ‘ఈశ్వరన్’లో పూంగొడి పాత్రలో నటించింది. అదే సమయంలో జయం రవి హీరోగా వచ్చిన ‘భూమి’లో శక్తి పాత్ర చేసి మెప్పించింది.

Advertisement

ఆ తర్వాత తెలుగులో అశోక్ గల్లా హీరోగా వచ్చిన ‘హీరో’లో సుభద్ర అలియాస్ సుబ్బు పాత్రలో కనిపించింది. 2022లో తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ‘కలగ తలైవన్’లో మైతిలి పాత్ర చేసింది. ఇలా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చినా.. ‘ఇస్మార్ట్ శంకర్’ స్థాయి మరో సక్సెస్ మాత్రం ఆమెకు దక్కకపోవడం గమనార్హం.

ఇలాంటి సమయంలో నిధికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడంతో ఒక్కసారిగా ఈ భామ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై.. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అయినా ఈ ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్ పంచమి పాత్రలో కనిపించింది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కడం, పవన్ కళ్యాణ్ నటించడం వల్ల నిధిపై కూడా మంచి అంచనాలే పెరిగాయి.కానీ సినిమా ఊహించని విధంగా బోల్తా కొట్టడం తో ఈ భామా పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయినా పరిస్థితి.

అయితే పవన్ సినిమా మిస్ అయినా  మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’అయినా తన ఆశలు నెరవేరుస్తుంది అనుకుంది .కానీ పొంగల్ బరిలో వచ్చిన ఈ సినిమా కూడా భారీ అంచనాల్ని మోయలేక బొక్క బోర్లా పడిపోయింది .

ఒక రకంగా ఇద్దరు బడా స్టార్స్ తో భారీ సినిమాలు చేసి సక్సెస్ చూడలేకపోయినదెవరన్నా ఉంటె నిధిని ఉదాహరణగా చెప్పాలి.చూడాలి మరి అందం అభినయం ఉన్న ఈ అందాల భామ సక్సెస్ ని ఎప్పుడు ఒడిసిపడుతుందో !

also read:గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×