E-Paper
Advertisement

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??
Advertisement

Big Tv Kissik Talks: సుప్రీత పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ సినీ నటి సురేఖ వాణి(Surekha Vani) కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత(Supritha)ను అభిమానులకు పరిచయం చేశారు. ఇక ఈమె మొదట్లో టిక్ టాక్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

నాన్న కోరిక ప్రకారమే ఇండస్ట్రీలోకి వచ్చాను..

సుప్రీత నటిగా పలు సినిమాలలో నటిస్తూ వెండి తెరపై సందడి చేశారు. ఇక ఈమె నటించిన సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఒక వైపు వెండితెర సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ప్రాజెక్టు కే, మాస్ జాతర వంటి పలు కార్యక్రమాలలో సుప్రీత సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి గల ప్రధాన కారణాలను తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిజానికి తాను ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు. ఏదో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేదాన్ని అక్కడికే పరిమితం అవుతాను అనుకున్నాను కానీ ఇక్కడదాకా వస్తానని అనుకోలేదని తెలిపారు.

నాన్న ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు..

Advertisement

ఇక తాను ఇండస్ట్రీ లోకి రావడానికి ప్రధాన కారణం మా నాన్న సురేష్ తేజ(Suresh Teja) గారని తెలిపారు. నాన్నగారి కోరిక ప్రకారమే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని సుప్రీత తెలిపారు. నాన్న కనుక ఇప్పుడు ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అలాగే నాన్న ఉంటే టెలివిజన్ రంగంలో తాను మరో స్థాయిలో ఉండే దానిని అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా తన తండ్రి కోరిక ప్రకారమే, తన తండ్రి కోరికను నెరవేర్చడం కోసమే ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ సుప్రీత తెలిపారు.

Advertisement

సుప్రీత తండ్రి సురేష్ తేజ దర్శకుడు అనే విషయం మనకు తెలిసిందే. ఈయన బుల్లితెర సీరియల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఇలా తండ్రి మరణం తర్వాత సుప్రీత సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి(Surekha Vani) కుమార్తెగా అందరికీ పరిచయమయ్యారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను బుల్లితెర కార్యక్రమాలలో అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం తాను సినిమాల కంటే కూడా టెలివిజన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశానని సుప్రీతం తెలియజేశారు.

Also Read: రష్మిక రణబాలి ఒకే చేయడానికి అతనే కారణమా? విజయ్ మాత్రం కాదండోయ్!

Related News

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Big Stories

Advertisement
×