E-Paper
Advertisement

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!
Advertisement

Adarsha Kutumbam:‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ ,వెంకీ మామ కాంబోలో ఈ సినిమా వస్తుందని తెలీడంతో మురిసిపోయారు మూవీ లవర్స్ ,మరో పంచుల ప్యాకేజ్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు .ఇక అప్పుడెప్పుడో సినిమా పక్కాగా అక్టోబర్ 2 న వస్తుందని అనౌన్స్ చేశారు కూడా ,కానీ ఆ తర్వాత ఆబ్బె అప్పుడు రావట్లేదు అంటూ అక్టోబర్ 9న ఆడియన్స్ ముందుకు వస్తుందని గంటా బజాయించి చెప్పారు మేకర్స్.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారబోతుందంటూ ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ చక్కర్లు కొడుతుంది.అదే అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదని, అక్టోబర్ 14కి వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన సినిమాలకు పండుగ సీజన్ ఎలా కలిసి వస్తుందో చెప్పక్కర్లేదు ,అందుకే దసరా సీజన్ లో ‘ఆదర్శ కుటుంబం’ను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఫైనల్ కట్ డైరెక్టర్ గురూజీకి అస్సలు నచ్చలేదని తెలుస్తుంది.ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు గురూజీకి సాటిస్ఫాక్షన్ లేదని ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ లో ఎదో మిస్ అయిందని,అదే సెట్ అయితే సినిమా మరో లెవల్ కి వెళ్తుందని త్రివిక్రమ్ అనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి .ఇపుడు ఆ కారణంగానే మరి కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నాడట గురూజీ .

Advertisement

సినిమా పూర్తయిన తర్వాత ఏదోలా రిలీజ్ చేసేయడం కంటే, థియేటర్‌లో ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందనేది గురూజీ ఆలోచనల కనిపిస్తుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాల్లో సెకండ్ హాఫ్ చాలా ముఖ్యమని చెప్పక్కర్లేదు . సెకండ్ హాఫ్ లో ఎమోషన్, క్లైమాక్స్ సాలిడ్ గా ఉంటేనే సినిమా వర్కౌట్ అవుతుందని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి కూడా.

ఇదే విషయంలో ‘ఆదర్శ కుటుంబం’ టీమ్ కేర్ తీసుకుంటోందని , దీంతో సినిమా రీ షూట్ వెళ్లడం పక్కా అని వినిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 14పై పడింది. రీషూట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ స్పీడప్ చేస్తే 14న సినిమా థియేటర్లలోకి రావచ్చని టాక్.

అయితే ఇది ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్ గానే పరిగణించాలి .మొత్తానికి అక్టోబర్ 9 మిస్ అవుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 14నైనా థియేటర్లలోకి వస్తుందా? లేక సెకండ్ హాఫ్‌పై ఇంకా వర్క్ చేయాల్సి రావడంతో మరోసారి వాయిదా పడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మరి ఈ రూమర్స్ పై మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారో చూడాలి !

also read:సందీప్ కిషన్ సిగ్మా సర్దుకున్నట్టేనా? అసలు లెక్క ఇదే!

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

Big Stories

Advertisement
×