E-Paper
Advertisement

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?
Advertisement

Singeetham Srinivas Rao Padma Awards: భారతదేశంలో సినిమా, కళలు ఇలా ఎన్నో వివిధ రంగాలలో ఎనలేని సేవలు అందించి, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నప్పటికీ కూడా కొంతమంది దిగ్గజాల ప్రతిభను ప్రభుత్వాలు గుర్తించడం లేదా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా ? అనే విశ్లేషణ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చిత్ర సీమలో తమ అసాధారణమైన ప్రతిభతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఎంతోమంది దిగ్గజ సెలబ్రిటీలు.. పద్మ అవార్డును అందుకోకుండానే కన్నుమూశారు. అలాంటి వారి జాబితాలోకి సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivas Rao) కూడా చేరతారు. మూకీ డ్రామా మొదలుకొని సైన్స్ ఫిక్షన్ వరకు.. జానపద చిత్రాల నుండి మ్యూజికల్ ఫాంటసీల వరకు.. ఇలా వైవిద్య భరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈయనను “విజయనరీ ఆర్కిటెక్” అని కూడా పిలుస్తారు.

సింగీతం కి పద్మ అవార్డ్స్ ఎందుకు రాలేదు?

ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ ప్రతి భాషలో తన ప్రమేయం కనబరిచారు. ముఖ్యంగా 50 ఏళ్ల సినిమా జీవితంలో ఆయన చేసింది 61 సినిమాలే అయినా.. ఆ 61 సినిమాలలో కూడా వినూత్నమైన కథలతో ప్రేక్షకుడి నాడీ పట్టుకొని అత్యద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పక విమానం సినిమాతో తొలిసారి డైలాగ్ లెస్ మూవీని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన.. ఆదిత్య 369 లాంటి టైం ట్రావెల్ మూవీతో తొలిసారి ఇండస్ట్రీలో సైన్స్ ఫిక్షన్ మూవీలకు తెర లేపారు.

Advertisement

సినిమా దర్శకులంతా ప్రేక్షకులకు అనుగుణంగా సినిమాలు తీస్తూ పోతుంటే.. కాలానికి ఎదురొడ్డి వినూత్నమైన విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఘనత సింగీతం శ్రీనివాసరావుది. 94 సంవత్సరాల వయసులో కూడా “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్” అని నిరూపిస్తూ.. ‘సింగ్ గీతం’ అనే సినిమాకి ఈ ఏడాది దర్శకత్వం వహించి దశాబ్దాలు దాటినా.. తనలో సినిమా పట్ల ఆసక్తి , మార్క్ చెరగలేదని నిరూపించారు. అలాంటి గొప్ప దిగ్గజ దర్శకుడికి ఎందుకు పద్మ అవార్డులు వరించలేదు ? అనే ప్రశ్న అభిమానులను ఎప్పటికప్పుడు వేధించింది.

అందుకే అవార్డు లభించలేదా?

ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు గారికి పద్మ (పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ) పురస్కారాలు లభించకపోవడం వెనుక నిర్దిష్టమైన అధికారిక కారణాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కొన్ని విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పద్మ అవార్డుల ఎంపికలో తరచుగా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులు, రాజకీయ మద్దతు కీలకపాత్ర పోషిస్తుంది అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. అయితే సింగీతం శ్రీనివాసరావు వివాదాలకు దూరంగా ఉండటం, కేవలం తన కళకే పరిమితమవడం, సెల్ఫ్ ప్రజెంటేషన్ ఇష్టం లేకపోవడం వల్ల ఆయన తరఫున బలమైన ప్రతిపాదనలు జరగలేదనేది అందరి అభిప్రాయం.

Advertisement

also read: సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా.. ఎంతమంది వారసులంటే?

నిజానికి ఆయన కేవలం ఒక్క భాషకే పరిమితం కాలేదు. తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ అంటూ అన్ని భాషలలో సినిమాలు చేశారు. దీనివల్ల ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను తమ ప్రాంతానికి చెందిన పూర్తిస్థాయి ప్రతినిధిగా ఓనర్ షిప్ తీసుకోకపోవడం కూడా ఒక మైనస్ అయి ఉండవచ్చు అని అభిప్రాయాలు సినీ విశ్లేషకులలో వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా సింగీతం శ్రీనివాస్ రావు.. సినీ ఇండస్ట్రీలో మిగతా దర్శకులు కమర్షియల్ చిత్రాలతో దూసుకుపోతుంటే.. ఈయన మాత్రం నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ ఆదిత్య 369, జానపదం భైరవద్వీపం లాంటి సరికొత్త ప్రయోగాలు చేయడానికి మొగ్గు చూపారు. ఇలాంటి భిన్నమైన ఆలోచనలను జాతీయస్థాయిలో అవార్డుల కమిటీలు సరిగా గుర్తించలేకపోయాయి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

‘సినిమా ప్రయోగశాల’గా ప్రేక్షకుడి మదిలో ప్రత్యేక స్థానం..

ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావు ఎప్పుడూ కూడా అవార్డుల కోసం ఆరాటపడలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లే తత్వమే ఆయనను పద్మ పురస్కారాలకు దూరం చేసిందేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఆయనకు పద్మ అవార్డులు వరించకపోయినా.. ప్రజల హృదయాలలో అసలైన స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన సినీ కెరియర్లో అద్భుతమైన చిత్రాలను అందించినందుకు గాను రెండు నేషనల్ అవార్డులు, ఐదు నంది అవార్డులతో పాటు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను సింగీతం శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. అలాంటి భారతీయ సినిమాను సాంకేతికంగా, వైవిధ్యంగా ముందుకు నడిపిన ‘సినిమా ప్రయోగశాల’గా సింగీతం శ్రీనివాసరావు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు అనేది వాస్తవం.

Related News

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

సందీప్ కిషన్ సిగ్మా సర్దుకున్నట్టేనా? అసలు లెక్క ఇదే!

Big Stories

Advertisement
×