Babu Mohan:టాలీవుడ్లో తనదైన బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ కామెడీ టైమింగ్‌తో ఎన్నో ఏళ్లపాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన సీనియర్ కమెడియన్ బాబూమోహన్ తాజాగా ‘ఆలీతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ లో ఎన్నో విషయాలను, జ్ఞాపకాలను ఆలీతో జరిగిన సంఘటనలని ఇలా మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఇన్ని సంవత్సరాల కెరీర్లో తాను దాదాపు 2,000 సినిమాల వరకు చేసి ఉంటానని బాబూమోహన్ చెప్పడం విశేషం. ఆ రోజుల్లో సినిమాల వెంట పరుగులు తీసే పనిలో ఉండటం వల్ల తాను చేసిన సినిమాలను ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదని, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఎన్నో చిత్రాలు చేశానని చెప్పారు. ఒకే సమయంలో పది సినిమాలకు ఒకేసారి డబ్బింగ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడిన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ తనకు నటనపై ఉన్న ఇష్టంతో మంచి పాత్రలు వస్తే చేస్తూనే ఉన్నానని ఆయన తెలిపారు.
ఇక సిల్క్ స్మిత తనను ఎక్కడ చూసినా ఎంతో ఆప్యాయంగా ‘బాస్’ అని పిలిచేదని నవ్వుతూ చెప్పారు బాబూమోహన్. ఒకసారి షూటింగ్ స్పాట్లో ఆమె టీషర్ట్ వేసుకుని ఉండటంతో మొదట గుర్తుపట్టలేదని, ఆమె పిలిచాకనే చూసి షాక్ అయ్యానని సరదాగా గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, ఆమె తన ఇంటికి తీసుకెళ్లి ఇల్లంతా ఎంతో అందంగా చూపించిందని, తెరపై బోల్డ్ ఇమేజ్ ఉన్నప్పటికీ నిజ జీవితంలో ఆమె ఎంతో మంచిదంటూ తనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా బయటపెట్టాడు.
ఇక తన కెరీర్లో మంచి పేరు తెచ్చిన ‘సీతాకోకచిలుక’ సినిమా గురించి చెబుతూ.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనను రాజమండ్రి నుంచి ఎలా పిలిపించిందీ వివరించారు. అప్పట్లో తనకు తమిళం రాకపోయినా, దర్శకుడికి తెలుగు రాకపోయినా అందరి సపోర్ట్ వల్లే ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశానని ఆ సినిమాలో తనకు ‘బాబాయి’ అనే పేరు పెట్టడం వెనుక జంధ్యాలగారితో ఉన్న అనుబంధం ఉందని, బాబాయి హోటల్లో కథలు రాసుకునే రోజులను గుర్తు చేసుకుంటూ ఆ పేరు పెట్టారని తెలిపారు.
ఇక హోస్ట్ ఆలీతో కలిసి చేసిన కామెడీ సీన్ల గురించి చెబుతూ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలని మరోసారి గుర్తు చేసుకున్నారు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగ్స్కే పరిమితం కాకుండా, స్పాట్లో సిట్యువేషన్‌కు తగ్గట్టుగా తమదైన టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో డైలాగ్స్ మార్చేవాళ్లమని చెప్పారు. దివాకర్ బాబు రాసిన మాటలకు తాము ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోడై ఆ సీన్లు అప్పట్లో థియేటర్లలో పేలిపోయేవని గుర్తు చేసుకున్నారు.ఏది ఏమైనా ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ మొదలుపెట్టి, దాదాపు రెండు వేల సినిమాల్లో నటించి, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించిన బాబూమోహన్ జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ అని చెప్పకతప్పదు.
also read:సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!