E-Paper
Advertisement

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్
Advertisement

Korean Reality Series: టీవీల్లో వచ్చే డేటింగ్ రియాలిటీ షోల్లో కెమెరాల ముందు ప్రేమ, ఎమోషన్స్ చూపించడం వేరు. కానీ షో అయిపోయి కెమెరాలు ఆఫ్ అయ్యాక, ఆ జంటలు నిజ జీవితంలోనూ కలిసి ఉంటున్నారా, లేక షో వరకే ఆ రిలేషన్ పరిమితమైందా అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. షోలో ఒకరినొకరు ఇష్టపడి జంటగా బయటకు వచ్చిన వాళ్లు ఆ తర్వాత కూడా తమ ప్రేమను కొనసాగిస్తారా ? పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా అనే విషయాలు తెలుసుకోవాలని ఆడియన్స్ అనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఆసక్తికరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చిన కొరియన్ రియాలిటీ సిరీసే ‘ఐయామ్ సోలో, లవ్ గోస్ ఆన్’ (I’m SOLO, Love Goes On). గతంలో ‘ఐయామ్ సోలో’ షోలో పాల్గొన్న వాళ్ల జీవితాల్లో ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాల నేపథ్యంలోనే ఈ సిరీస్ నడుస్తుంది. మరి ఈ సిరీస్ ను ఇండియాలో ఎక్కడ చూడవచ్చు ? అంటే…

అసలు కాన్సెప్ట్ ఏంటంటే ?

‘ఐయామ్ సోలో’ అనేది పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తమకు సరైన లైఫ్ పార్ట్‌నర్‌ ను వెతుక్కుంటూ వచ్చే సింగిల్స్‌ తో రూపొందించిన పాపులర్ కొరియన్ డేటింగ్ రియాలిటీ షో. ఇందులో పాల్గొనే వాళ్లు ముందుగా ఒకరికొకరు పరిచయమవుతారు. తమ ఇష్టాలు, అయిష్టాలు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటారు. కలిసి సమయం గడుపుతూ ఒకరిపై మరొకరికి ఇష్టం పెరుగుతుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి కొందరు జంటలుగా ఏర్పడతారు. మరికొందరు మాత్రం తమకు సరైన వ్యక్తి దొరకక ఒంటరిగానే షో నుంచి బయటకు వస్తారు.

Advertisement

అయితే జంటగా బయటకు రావడంతోనే ప్రేమకథ పూర్తవదు. నిజ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత అభిరుచులు, భవిష్యత్తుపై ఆలోచనలు… ఇలా ఎన్నో విషయాలు ఇద్దరి మధ్య బంధాన్ని ప్రభావితం చేస్తాయి. షోలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు సంతోషంగా కనిపించిన వాళ్లు, బయట కూడా అదే అనుబంధాన్ని కొనసాగించగలుగుతున్నారా లేదా అనేదే ఆసక్తికరమైన విషయం.

ఈ నేపథ్యంలో ‘లవ్ గోస్ ఆన్’’ గతంలో ‘ఐయామ్ సోలో’లో పాల్గొన్న వాళ్ల జీవితాలపై మరింత ఆసక్తిని పెంచుతుంది. షో తర్వాత వారి బంధాలు ఎలా మారాయి, ప్రేమను కొనసాగించిన వాళ్లు ఎవరు ? విడిపోయిన వాళ్లు ఎవరు ? కొందరి జీవితాల్లో ఎలాంటి కొత్త మలుపులు వచ్చాయి ? అనే విషయాలను తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ప్రతి జంట పెళ్లి చేసుకుందా లేదా అనే వివరాలే కాకుండా, షో తర్వాత వారి అనుభవాలు, సంబంధాల్లో వచ్చిన మార్పులు కూడా ఈ కాన్సెప్ట్‌ లో కీలకంగా ఉంటాయి.

తెలుగులో ఉందా ?

Advertisement

‘ఐయామ్ సోలో, లవ్ గోస్ ఆన్’ కొరియన్ రియాలిటీ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. ఈ కార్యక్రమానికి డెఫ్‌కాన్ (Defconn), పార్క్ గ్యోంగ్-రీ (Park Kyung-ri), జంగ్ హే-సంగ్ (Jung Hye-sung) హోస్టులుగా వ్యవహరిస్తారు. గతంలో చూసిన పార్టిసిపెంట్స్‌ ను మళ్లీ చూడటం, వారి జీవితాల్లో జరిగిన మార్పులను తెలుసుకోవడం ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డేటింగ్ షోలు, ప్రేమకథలు, నిజ జీవిత సంబంధాల గురించి తెలుసుకోవడం ఇష్టపడే వారికి ఇది ఆసక్తిని కలిగించే రియాలిటీ షో.. కొరియన్ రియాలిటీ షోలు, డేటింగ్ కార్యక్రమాలు ఇష్టపడే వాళ్లు మాత్రం ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు.

Read Also: కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

Tags

Related News

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

Big Stories

Advertisement
×