E-Paper
Advertisement

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!

సాయంత్రం మాట్లాడుకున్నాం.. తెల్లవారుజామున ఆ వార్త .. కోట గురించి బాబూమోహన్ ఎమోషనల్!
Advertisement

 Babu Mohan:బాబూమోహన్..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఈ వెటరన్ కమెడీయన్ తాజాగా అలీతో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన సినీ జర్నీ, ఆనాటి రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు బాబు మోహన్ . ముఖ్యంగా సినిమాలో ఎప్పుడూ నవ్విస్తూ ఉండే బాబూమోహన్, కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు థియేటర్లలో పూనకాలే. తమిళంలో సెంథిల్, గౌండమణి జోడీకి ఎంత క్రేజ్ ఉందో, తెలుగులో ఈ ఇద్దరి కామెడీకి అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదన్నది స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే స్క్రీన్ పై నవ్వించే ఈ ఇద్దరూ నిజ జీవితంలోనూ ప్రాణ స్నేహితులుగా ఉండేవారట.

ఎవరికి వారు బిజీగా ఉన్నప్పటికీ, రోజూ ఒకరినొకరు ఫోన్ చేసుకుని పలకరించుకోవడం అలవాటుగా ఉండేదని బాబూమోహన్ తెలిపారు. అయితే కోటతో జరిగిన చివరి ఫోన్ కాల్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బాధను మిగిల్చిందని ఆయన చెప్పారు.

Advertisement

ఒకరోజు సాయంత్రం కోట శ్రీనివాసరావుతో ఫోన్‌లో చాలా సరదాగా మాట్లాడుకున్నారట. “మనం ఇంకా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాం, మిగతావాళ్లంతా ఎప్పుడో రిటైర్ అయిపోయారు” అంటూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ జోకులు వేసుకున్నామని, మరుసటి రోజు మళ్లీ కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేశామని బాబూమోహన్ గుర్తుచేసుకున్నారు. కానీ, తెల్లవారుజామున 5 గంటలకే కోట మరణ వార్త తన చెవిన పడిందని చెప్పారు.

సాయంత్రం వరకు నవ్వుతూ మాట్లాడిన మనిషి తెల్లవారేసరికి ఇకలేరనే వార్తను తాను అసలు తట్టుకోలేకపోయానని, ఆ సంఘటన తనను ఎంతగానో కుంగదీసిందని కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు తాను మామూలు స్థితికి రాలేకపోయానని ఎమోషనల్ అయిపోయారు.

.ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన రోజులను తలచుకుంటూ చిరుని ఆకాశానికి ఎత్తేశారు. ‘హిట్లర్’ సినిమా షూటింగ్ సమయంలో తాను సైకిల్‌పై వస్తుంటే, చిరంజీవి బుల్లెట్‌పై వచ్చేవారని, తన క్లైమాక్స్ సీన్ కోసం చిరంజీవి చాలా ఓపికగా ఎదురుచూసి మరీ చేయించారని గుర్తుచేసుకున్నారు.
ఇక ఆ కాలంలో రోజుకు నాలుగు షిఫ్టుల్లో తెల్లవార్లు పనిచేసిన కష్టాలను వివరించారు.

ఇక చిన్నతనంలో ఎన్టీఆర్ సినిమా చూడటానికి రెండు రూపాయలు తీసుకుని వెళ్లిన రోజులను, తనను ఎంతగానో ప్రేమించిన తల్లి గురించిన జ్ఞాపకాలను చెబుతూ బాబూమోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యారు . సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనూ తల్లి తనను కంటికి రెప్పలా చూసుకుందని గుర్తు చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం సినిమాలకు రాజకీయాలకు దూరంగా కుటుంబంతో, ముఖ్యంగా మనవరాళ్లతో సంతోషంగా గడుపుతున్నానని ఆయన తెలిపారు.మొత్తంగా కోటతో తనకి ఉన్న అనుబంధాన్ని వివరించిన తీరు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

also read:గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

గ్లామర్ డోస్ పెంచిన నభా నటేష్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దుల్కర్ సినిమాలో రుహాని శర్మ.. బిజిలిగా కొత్త అవతారం!

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్.. మళ్లీ వాయిదా పడిన ఇట్లు అర్జున..!

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

Big Stories

Advertisement
×