Varanasi Movie : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం వారణాసి. ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా వస్తుందంటే దానిపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు డిమాండ్ అలాంటిది కాబట్టి జనాలు అందరూ కూడా రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గతంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం మామూలు విషయం కాదు.. ఇప్పుడు వస్తున్నా వారణాసి పై కూడా రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మూవీ దాదాపు 80% షూటింగ్ని పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందులో కీలకమైన ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండదా ఈ మూవీ లోని ఒక బిగ్ ఫైట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. కేవలం ఒక్క సీన్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ సీన్ కోసం ఎన్ని కోట్లు జక్కన్న ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాజమౌళి చేసే సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైన బజ్ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఆయన పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని చాలా వరకు పెంచాడు. ఈయన తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా రికార్డును బ్రేక్ చేశారు.. ప్రపంచ దేశాలకు తెలుగు సినిమాలను పరిచయం చేశారు.. అందుకే రాజమౌళి సినిమాలకు డిమాండ్ ఎక్కువ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో జనాలను ఆకట్టుకునే విధంగా ఒక ఫైట్ సీన్ ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది.. అందులో ఒక పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేశారట. దాదాపు ఈ యాక్షన్ సీక్వెన్స్ 15 నిమిషాల పాటు కొనసాగుతుందనే టాక్.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ సారధ్యంలో ఈ ఫైట్ చేస్తున్నారట. ఆ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీనికోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నారట.. చూడాలి ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుందో..
Also Read :గుడ్ న్యూస్ చెప్పిన ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ నర్మద.. ఫ్యాన్స్ కు ఇది షాకే..!
ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలను తెరకెక్కించడం రాజమౌళి స్టైల్.. సినీ ఇండస్ట్రీలో కానీ ఎరుగని స్టోరీలతో ఈయన తెలుగు ప్రేక్షకులను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమా స్టోరీ ఎంతగా డిమాండ్ చేస్తుందో అంతకుమించి బడ్జెట్ని పెట్టడానికి కూడా నిర్మాతలు రెడీగా ఉంటున్నారు.. ఈ సినిమాకు దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ అవుతుందని ముందుగా అంచనా వేశారు.. కానీ ఇప్పుడు చూస్తుంటే 1500 కోట్లు దాటే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అద్భుతమైన ఔట్ పుట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు.. మరి ఈ సినిమా రాజమౌళి కి ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..