E-Paper
Advertisement

Iran War: యుద్ధం ముదిరింది.. భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధం చర్య అన్న ఇరాన్

Iran War: యుద్ధం ముదిరింది.. భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై అమెరికా దాడి.. యుద్ధం చర్య అన్న ఇరాన్
Advertisement

Iran War: ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులకు తెగ దిగుతున్నాయి. ఇరాన్‌ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ విమానంపై దాడి చేసింది అమెరికా. మానవతా సహాయం కింద మహాన్ ఎయిర్‌కు చెందిన ఈ విమానం మందులు, వైద్య సామాగ్రిని కోసం న్యూఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఈ ఘటనపై ఇరాన్ మండిపడింది. ఇది ముమ్మాటికీ యుద్ధం చర్యగా వర్ణించింది.

భారత్‌కు వెళ్లాల్సిన విమానంపై దాడి.. ఖండించిన ఇరాన్

Advertisement

ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత ఊహించని పరిణామం రాత్రి చోటు చేసుకుంది. భారత్ బయలుదేరడానికి సిద్ధమైన ఇరాన్‌కి చెందిన పౌర విమానంపై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడి చేశాయి. ఈ ఘటన మషద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడి వెనుక అమెరికా-ఇజ్రాయెల్ ఉందని ఆరోపించింది.

మహాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం.. మందులు, అవసరమైన వైద్య సామాగ్రిని మానవతా సహాయం కింద వివిధ దేశాల నుంచి ఇరాన్‌కు రవాణా చేస్తోంది. ఈవారం లేదా వచ్చే వారం ఈ విమానం భారత్‌కు రావాల్సివుంది.  నష్టం తీవ్రత, ప్రాణనష్టం జరిగిందా? దాడి సమయంలో విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతోందా? అనే వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ఘటనపై ఇరాన్‌ పౌర విమానయాన శాఖ తీవ్రంగా ఖండించింది.

Advertisement

మిస్సైళ్ల దాడిలో దెబ్బతిన్న మహాన్ విమానం, యుద్ధ చర్యేనన్న ఇరాన్

మానవతా సాయాన్ని తరలించే పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఇరాన్ మండిపడింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. దీన్ని యుద్ధ చర్యగా వర్ణించిన ఇరాన్, బాధ్యులపై విచారణ జరపాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపు ఇచ్చింది. అయితే ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఘటన నేపథ్యంలో వాషింగ్టన్- టెహ్రాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచుతుందని భావిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్.. ఐఆర్‌జిసితో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ అంతటా గగనతలం, నౌకా మార్గాలు, కీలక మౌలిక సదుపాయాల విషయంలో ఒత్తిడికి గురవుతోంది. ఈ తరుణంలో ఢిల్లీకి వెళ్లనున్న సహాయ సామగ్రికి సంబంధించిన విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు భారతలో కాకుండా అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో కొత్త ఆందోళనలను రేకెత్తించే అవకాశం ఉంది.

ALSO READ: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఖర్గ్ ద్వీపంతోపాటు చమురు కూడా స్వాధీనం చేసుకుంటాం

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×