78th Emmy Awards 2026:అంతర్జాతీయంగా.. సినిమాలకు ‘ఆస్కార్ అవార్డు’ ను ఎలా అయితే ప్రతిష్టాత్మకమైన అవార్డుగా చెప్పుకుంటారో ఇటు టెలివిజన్ డిజిటల్ రంగానికి కూడా ఎమ్మీ అవార్డులను అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇకపోతే అంతర్జాతీయంగా టెలివిజన్, డిజిటల్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ ఎమ్మీ అవార్డులను అందజేస్తారు.
ఈ ఏడాది 78వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డుల కార్యక్రమం అమెరికా కాలమాన ప్రకారం సెప్టెంబర్ 14 2026న లాస్ ఏంజిల్స్ లోని పీకాక్ థియేటర్లలో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను ఇండియాలో సెప్టెంబర్ 15 తెల్లవారుజామున 4:30 గంటల నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ వేదికగా లైవ్ లో చూడవచ్చు.
టెలివిజన్ అకాడమీ ఆధ్వర్యంలో అందించే ఈ అవార్డులను ముఖ్యంగా టీవీ, సిరీస్ లు , రియాలిటీ ప్రోగ్రామ్లతో పాటు కామెడీ షోలు అలాగే ఇందులో నటించిన ఉత్తమ నటీనటులకు ,దర్శకులకు, ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. వీటితోపాటు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాలలో కూడా ఈ సత్కారాలు జరుగుతాయి.
ఇకపోతే ఈ ఏడాది ఎమ్మీ అవార్డులలో అత్యధిక నామినేషన్లు పొందిన వాటిలో ‘ది పిట్’ కూడా ఒకటి. హెచ్ బి ఓ కి చెందిన ఈ మెడికల్ డ్రామా కు ఏకంగా 25 కి పైగా నామినేషన్లు లభించాయి. దీని తర్వాత 24 నామినేషన్లతో ‘హాక్స్’ నిలిచింది. కామెడీ సీరీస్ గా రాబోతున్న ఈ షో ఎమ్మీ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఒక కామెడీ సీరీస్ కి ఈ రేంజ్ లో నామినేషన్లు రావడం ఇదే తొలిసారి. ఇకపోతే ఈ ఏడాది అత్యధిక నామినేషన్స్ పొందిన వాటిలో 17 నామినేషన్లతో బలమైన స్థానంలో నిలిచింది డిటిఎఫ్ సెయింట్ లూయిస్. చెరో 15 నామినేషన్లతో ది బేర్, ఆల్ హర్ ఫాల్ట్ స్థానం సంపాదించుకోగా.. 13 నామినేషన్లతో డి గిల్డెడ్ ఏజ్ , చెరో పది స్థానాలతో ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్, అబాట్ ఎలిమెంటరీ నామినేషన్లు అందుకున్నాయి. తొమ్మిది నామినేషన్లతో యుఫోరియా ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది.
also read:హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!
ఇకపోతే మన ఇండియాలో తెల్లవారుజామునే ఈ వేడుక ప్రారంభం కాబోతోంది కాబట్టి ఆ సమయంలో లైవ్ ప్రోగ్రామ్ చూసే అవకాశం చాలా తక్కువ. అందుకే లైవ్ మిస్ అయినవారికి వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం కూడా ఉండడం మరో విశేషం. అంటే ఇందుకు సంబంధించిన వీడియోను నిర్వాహకులు రిలీజ్ చేయబోతున్నారు.మరి ఈసారి ఎన్ని అవార్డ్స్ వేడుకల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారు? అత్యధిక నామినేషన్లతో అవార్డులు దక్కించుకునే షోలు ఏంటో తెలియాలి అంటే సెప్టెంబర్ 14 వరకు ఎదురు చూడాల్సిందే.