E-Paper
Advertisement

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!
Advertisement

Mamitha Baiju:క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ నటి మమితా బైజు(Mamitha baiju) గురించి ప్రేక్షకులకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. రీసెంట్గా సూర్యా(Suriya) తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమె.. వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె ‘క్లైడ్ ఓనం 2026’ వేడుకల్లో భాగంగా మెల్ బోర్న్ లో నిర్వహించనున్న ఈ వేడుకలకు గెస్టుగా హాజరు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ కార్యక్రమంను నిలిపివేశారు. దీనికి కారణం మమితా బైజు హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

హాస్పిటల్లో చేరిన మమితా బైజు..

వరుస సినిమాలతో విశ్రాంతి లేకుండా గడపడం వల్లే ప్రస్తుతం ఈమె హాస్పిటల్ పైన పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసిన ఈమె.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని చెప్పింది. కానీ తనకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, హాస్పిటల్లో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మమిత బైజు త్వరగా కోలుకోవాలని, ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కూడా కోరుతున్నారు.

Advertisement

also read:హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

వాయిదా పడ్డ ఓనం సెలబ్రేషన్స్..

ఇకపోతే ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో నిర్వహించనున్న క్లైడ్ ఓనం 2026 వేడుకల్లో మమిత ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో మమిత పాల్గొనాల్సిన ఈ ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది . ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించారు.

అరుదైన రికార్డు సృష్టించిన మమిత బైజు..

Advertisement

మలయాళ బ్యూటీ మమిత బైజు ఇప్పుడు నక్కతోక తొక్కిందా అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద ఈమె అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈమె నటించిన సినిమాలు విడుదల కాగా.. ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో నెల రోజుల్లోనే మూడు సినిమాలతో రూ.200 కోట్లు సాధించిన హీరోయిన్ గా మమితా బైజు రికార్డు సృష్టించింది. విషయంలోకి వెళ్తే .. జూలై 23న ఈమె నటించిన జననాయగన్ విడుదలై.. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఆ తర్వాత సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా 240 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది . ఇటీవల విడుదలైన మలయాళం మూవీ బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ కూడా రూ m.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.. దీంతో నెలలోనే హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్గా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×