80s Vintage Style Trend:ఇదసలె సోషల్ మీడియా జమానా ..అందునా AI దూసుకొస్తున్న కాలం.ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ఇదిగో ఈ క్రమంలోనే ఇపుడు ఎక్కడ చూసినా 80s వింటేజ్ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి.సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ,బిజినెస్ మ్యాన్స్, క్రికెటర్స్ అన్న తేడా లేకుండా అంతా తమ తమ ఫోటోలని 80s వింటేజ్ స్టైల్ లోకి మార్చేసుకుని తెగ సంబరపడిపోతున్నారు.
పైగా దీనికి పెద్ద కష్టపడక్కర్లేదు కూడా. సింపుల్ గా AI లో మన పిక్ ని ఇచ్చేసి ’80s వింటేజ్ స్టైల్ అన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే అధ్బుతమైన ఓల్డ్ లుక్ ఫొటోలతో అలనాటి రోజుల్లోకి తీసికెళ్ళిపోతుంది.
ఇక ట్రెండ్ అవుతున్న ’80s వింటేజ్ స్టైల్ ఫీవర్ మన టాలీవుడ్ కి కూడా గట్టిగానే పట్టుకుంది. కుర్ర హీరోలు ఆదిసాయి కుమార్, సుశాంత్, అలాగే మంచు లక్ష్మి, ఈషా రెబ్బ,అనన్య నాగళ్ల, ప్రియాంక జువాల్కర్, అనుపమ పరమేశ్వరన్ వంటి అందాల భామలంతా తమని తాము 80s వింటేజ్ స్టైల్ లోకి మార్చేసుకుని మురిసిపోతున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఓల్డ్ పిక్‌కు ఏఐ టచ్ ఇచ్చి ‘OG ఎప్పటికీ OGనే’ అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఇక ఐశ్వర్యా రాజేష్,నందితా శ్వేతా ,తేజ సజ్జా , ప్రీతి ముకుందన్ వంటి వారు కూడా తమ తమ ఫోటోలకి ’80s వింటేజ్ స్టైల్ అద్దిన వారే.
ఇక వీరితో పాటు సీరియల్స్ భామలు కూడా తమని తాము ’80s వింటేజ్ స్టైల్ లోకి మార్చుకుంటూ వెండితెర స్టార్స్ కి గట్టిపోటీనే ఇస్తున్నారు.ఇలా కొందరు స్టార్ తమని తాము రెట్రో లోకి మార్చేసుకుంటే మరికొంత మంది ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటుల్ని ఇలా రెట్రో లుక్ లోకి మార్చేసి మురిసిపోతున్నారు .
అలా ఇప్పటికే చిరు, బాలయ్య ,నాగ్, వెంకీ, చరణ్ ,నానీ, తారక్,బన్నీ…ఇలా ఒకరని కాదు,అందరిని ’80s వింటేజ్ స్టైల్ లోకి మార్చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.
అయితే ఇలా సరదాగా పోస్ట్ లకే పరిమితం కాకుండా సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ ’80s వింటేజ్ స్టైల్ ని దించడం ఇక్కడ విశేషం.ఇలా ఇప్పటికే అనిల్ రావిపూడి తన జనవరి 13విడుదల సినిమాకి ఇలా రెట్రో లుక్ తీసుకురాగా, రేపే రిలీజ్ కానున్న ఎపిక్ సినిమాని కూడా ఇలాగే ’80s వింటేజ్ స్టైల్ లో ప్రమోషన్స్ చేయడం మొదలెట్టింది మూవీ టీమ్.
ALSO READ:బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!
మొత్తంగా ఇపుడు ఎక్కడ చూసినా ’80s వింటేజ్ స్టైల్ ఫీవర్ ఊపేస్తుండటంతో ఏంటీ ట్రెండ్ మామా.. అంటూ సరదాగా కామెంట్స్ విసురుతున్నారు మూవీ లవర్స్. చూడాలి ముందు ముందు ఈ ట్రెండ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !