E-Paper
Advertisement

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
Advertisement

January 12 Vidudala: అనిల్ రావిపూడి సంక్రాంతికి హిట్ మిషన్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు. ఈయన ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తన కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటున్న సంగతి. ఇలా సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి (Anil Ravipudi)సినిమా అందరికీ గుర్తుకొస్తుంది. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు కూడా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జనవరి 12 విడుదలపై ఫస్ట్ రివ్యూ..

Advertisement

ఈయన తన మొదటి సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram ) , విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోలుగా నటిస్తున్న చిత్రం “జనవరి 12 విడుదల”(January 12 Vidudala) బావ బావమరుదుల కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి సందడి చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలుస్తుందే.

పక్కా సంక్రాంతి బ్లాక్ బస్టర్..

Advertisement

అనిల్ రావిపూడి సినిమా అంటేనే సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 12 విడుదల సినిమా టైటిల్ కాస్త విభిన్నంగా ఉండడంతో సినిమా పై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్(G.V.Prakash) అందించారు. జనవరి 12 విడుదల సినిమాకు సంబంధించి 1:30 మినిట్స్ ఫుటేజ్ చూశారని తెలిపారు అయితే ఈ ఫుటేజ్ చూస్తుంటే మాత్రం రాబోయే సంక్రాంతికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇలా సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ చేసిన ఈ పోస్టును ఈ సినిమా నిర్మాణ సంస్థలు సైన్ స్క్రీన్, సురేష్ ప్రొడక్షన్స్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ రివ్యూ సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పాలి. అనిల్ రావిపూడి సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇప్పటివరకు ఈయన దాదాపు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ తొమ్మిది సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ కావడం విశేషం . ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి తర్వాత ఆ జాబితాలో అనిల్ రావిపూడి ఉన్నారని చెప్పాలి. మరి జనవరి 12 విడుదల సినిమా ద్వారా అనిల్ రావిపూడి ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఈయన డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ కి ఇది రెండో సినిమా కాగా, వెంకటేష్ కి మాత్రం ఐదో సినిమా అని చెప్పాలి.

Also Read: అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

Related News

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

మనవడి కోసం నాగబాబు సంచలన నిర్ణయం!

అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ పిలుపు!

Big Stories

Advertisement
×