E-Paper
Advertisement

పెద్ది టీమ్ కి షాక్.. ఉరేసుకుంటానంటూ అభిమాని లేఖ!

పెద్ది టీమ్ కి షాక్.. ఉరేసుకుంటానంటూ అభిమాని లేఖ!
Advertisement

Peddi Movie:సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచి సినిమా విడుదల తేదీ వచ్చే వరకు అభిమానులు ఆ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆయా సినిమాల షూటింగ్లలో జాప్యం ఏర్పడినా.. లేదా అనౌన్స్మెంట్ ఇవ్వడంలో కాస్త ఆలస్యం అయినా సరే అభిమానులు కాస్త సహనం కోల్పోతారు అనడానికి వారి నుంచి వచ్చే లేఖలే అందుకు నిదర్శనం అని చెప్పాలి. ముఖ్యంగా తమ అభిమాన హీరో నుంచి వచ్చే సినిమా కాస్త ఆలస్యమైనా సరే ..టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటామంటూ చిత్ర బృందాలకు షాక్ ఇస్తున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఒక అభిమాని పెద్ది మూవీకి భారీ షాక్ ఇచ్చారు.

పెద్ది టీంకి షాక్.. అభిమాని సూసైడ్ లెటర్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న చిత్రం పెద్ది. జూన్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్నా.. ఇంకా ప్రమోషన్లు మొదలు పెట్టకపోవడంతో ఒక అభిమాని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.. ఈ మేరకు ఉరి వేసుకుంటాను అంటూ ఒక సూసైడ్ లెటర్ రిలీజ్ చేశారు. వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించకపోతే ఉరేసుకుంటానంటూ హెచ్చరించారు. గతంలో గేమ్ చేంజర్ విడుదలలో జాప్యం.. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఈ మెంటల్ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. మీరు వెంటనే కనుక షెడ్యూల్ ప్రకటించకపోతే.. ఉరి వేసుకుంటాను ఆ తర్వాత మీ ఇష్టం అంటూ బెదిరిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సూసైడ్ నోట్ వైరల్ గా మారిందని చెప్పవచ్చు. మరి అభిమాని కోరిక మేరకు పెద్ది టీమ్ ప్రమోషన్ షెడ్యూల్ ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

also read:బండి భగీరథ్ అరెస్ట్ ఆలస్యంపై ప్రకాష్ రాజ్ ఫైర్!

పెద్ది సినిమా విశేషాలు..

Advertisement

పెద్ది సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనెల 18వ తేదీన ఈ సినిమా నుండి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 2వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్గా నిర్వహించనున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది..ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులలో మంచి జోష్ నింపాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×