E-Paper
Advertisement

IBomma Ravi: వామ్మో ఇదేం క్రేజ్ సామీ.. ఐ బొమ్మ రవికి మద్దతుగా పొట్టపై టాటూ..

IBomma Ravi: వామ్మో ఇదేం క్రేజ్ సామీ.. ఐ బొమ్మ రవికి మద్దతుగా పొట్టపై టాటూ..
Advertisement

IBomma Ravi: ఐబొమ్మ రవి ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఈయనని ఒక నేరస్తుడిగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ అభిమానులు మాత్రం ఈయనని ఒక హీరోగా, దేవుడిగా భావించి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఐ బొమ్మ రవి పేదల పాలిట దేవుడని, రియల్ హీరో అంటూ ఈయనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా తనకు మద్దతుగా నిలవడం సినిమా ఇండస్ట్రీని, పోలీస్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రవికి మద్దతు తెలియజేస్తూ కొన్ని పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. అయితే తాజాగా ఓ అభిమాని వినూత్న రీతిలో ఐ బొమ్మ రవికి మద్దతు తెలియజేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

పొట్ట పై ఐ బొమ్మ టాటూ ..

ఐ బొమ్మ రవికి మద్దతు తెలియజేస్తూ ఒక అభిమాని ఏకంగా తన పొట్టపై ఐ బొమ్మ అని టాటూ (Tattoo) వేయించుకున్నారు. ఇలా పొట్టపై టాటూ వేయించుకోవడం అంటే ఏ స్థాయిలో రవికి మద్దతు తెలియజేస్తున్నారో స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా రవికి బయట ఏ స్థాయిలో క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది. అయితే టాటూ వేయించుకున్న ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం ఎక్కడా వెల్లడి కాలేదు. ఇలా రోజు రోజుకు రవికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

రవికి బెయిల్ వచ్చేనా?

Advertisement

రవిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం చంచల్ కూడా జైలుకు తరలించారు. 14 రోజులపాటు ఈయనకు రిమాండ్ విధించింది . అయితే నేటితో రవి రిమాండ్ గడువు పూర్తి కావడంతో మరోసారి కోర్టుకు తీసుకు వెళ్ళనున్నారు. అయితే ఈ 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఐదు రోజుల పాటు పోలీసులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో రవి ఎలాంటి విషయాలను వెల్లడించని నేపథ్యంలో ఈయనకు రిమాండ్ పొడిగించాలని కోరుతున్నారు. రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

ఇలా వీటన్నింటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటే రవికి బెయిల్ రావడం పక్కన పెడితే శిక్ష మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రవిని బయటకు తీసుకురావడం కోసం లాయర్ సలీం ముందుకు వచ్చారు. ఈయన రవి కేసును వాదించబోతున్న సంగతి తెలిసిందే. మరి రవి ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు పోలీసులు ఎన్నో విధాలుగా రవిని విచారించిన ఆయన మాత్రం పోలీసులకు పెద్దగా సహకరించలేదని, కీలక విషయాలు చెప్పడానికి నిరాకరించారని తెలుస్తుంది. మరోవైపు తన తండ్రి అప్పారావు సైతం కోర్టుల చుట్టూ తాను తిరగలేను కానీ తన కొడుకు బయటకు రావడం కోసం ఆర్థికంగా లాయర్లకు సహాయం చేస్తాను అంటూ మాట్లాడారు. మరి రవి బెయిల్ మీద బయటకు వచ్చేనా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్… ఒకరోజు ముందుగానే సినిమాను చూడొచ్చు

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×