E-Paper
Advertisement

Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్… ఒకరోజు ముందుగానే సినిమాను చూడొచ్చు

Akhanda 2 : బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్… ఒకరోజు ముందుగానే సినిమాను చూడొచ్చు
Advertisement

Akhanda 2 : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మరో బ్లాక్ బాస్టర్ కూడా లోడింగ్ అని చెప్పాలి. శబరి ఐదవ తేదీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లు తెరకెక్కిన అఖండ 2 (Akhanda 2)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒకరోజు ముందుగానే ఆఖండ 2..

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కానీ టీజర్ ట్రైలర్ వంటి వీడియోలు కూడా సినిమా పట్ల అంచనాలను పెంచేయడమే కాకుండా 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నిర్మాతలు అఖండ 2 సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రీమియర్లను (Premieres) వేయాలని ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇలా ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇక అఖండ తాండవమే..

Advertisement

సాధారణంగా ప్రీమియర్లు అనేది చిన్న సినిమాలకు కంటెంట్ బేస్డ్ సినిమాలకు వేస్తారు. కేవలం పాజిటివ్ టాక్ కోసమే చిన్న సినిమాలకు ఇలా ప్రీమియర్లను ప్రసారం చేస్తూ ఉంటారు కానీ బాలయ్య లాంటి స్టార్ హీరోకి ప్రీమియర్లు అవసరంలేదని చెప్పాలి.అందులో బోయపాటి బాలయ్య కాంబో అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్.. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆఖండ 2 సినిమాకి ప్రీమియర్లను ప్రసారం చేయబోతున్నారని తెలిసి అభిమానులు ఒకింత ఆశ్చర్యపోయినా, మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే బాలకృష్ణ అఖండ తాండవం ఏంటో చూపించబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంతోషపడుతున్న బాలయ్య అభిమానులు..

Advertisement

బాలకృష్ణ సినిమాకు ప్రీమియర్లను ప్రసారం చేయడం వెనుక కూడా నిర్మాతలు మంచి ప్రణాళికలను రచించారనే తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పట్ల మంచి బజ్ ఉన్న నేపథ్యంలో పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా పట్ల మరింత హైప్ పెరగడమే కాకుండా కలెక్షన్ల పై కూడా మంచి ప్రభావం చూపుతుందని అందుకే నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా బాలయ్య సినిమా ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి రాబోతుందని తెలిసిన అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నాలుగో సారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: IBomma Ravi Father: వాళ్లు ఏం అయిన ఆకాశంలో నుంచి ఊడి పడ్డారా.. మెగా హీరోలపై ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×