E-Paper
Advertisement

ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో.. ఇద్దరి ఫేట్ మారేనా?

ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో.. ఇద్దరి ఫేట్ మారేనా?
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబో ఇప్పుడు తెరపైకి రాబోతుండడంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో మరో ఫ్లాప్ హీరో జతకట్టబోతున్నారు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలో పేరు మోసిన కుటుంబం నుండి ఆ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆయన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు.

ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో..

పైగా స్టార్ హీరోయిన్లు కూడా ఈయనతో సినిమాలు చేశారు. అవి కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. ఇక దీంతో ఈ హీరో పని అయిపోయింది.. ఇప్పటికైనా ఈ హీరో ఖాతాలో ఒక సినిమా హిట్ పడకపోతే ఇక ఈయన ఇండస్ట్రీకి దూరం కావాల్సిందే అనే కామెంట్లు వస్తున్న సమయంలో ఆయన ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ వార్తలు మాత్రం అటు సదరు హీరో అభిమానులలో ఆందోళనలను కలిగిస్తున్నాయి.

Advertisement

ALSO READ:యుగానికి ఒక్కడు 2 ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా!

ఫేట్ మారుతుందా?

మరోవైపు ఆ డైరెక్టర్ అయినా తన సినిమాలతో హిట్ కొట్టాడా అంటే ఈ మధ్యకాలంలో లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆ హీరో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పాన్ ఇండియా స్టార్ తో తొలిసారి కొత్త ప్రయోగం చేశారు . ఆ హీరో కెరియర్ లోనే తొలి హారర్ కామిడీ బ్యాక్ డ్రాప్ అది. ఖచ్చితంగా ఆ సినిమా హిట్ కొడుతుందని ఆ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు . కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు. పైగా ముగ్గురు హీరోయిన్లతో చేసిన సందడి.. పాత హీరోయిన్ లను ఇందులో కీలకం చేయడం అన్నీ బాగానే ఉన్నా.. ఆ స్టార్ హీరోని సరిగ్గా ఈ డైరెక్టర్ వాడుకోలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి. అలాంటి ఈ డైరెక్టర్ ఇప్పుడు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న సమయంలో ఈయనతో సినిమా చేయడానికి ఆ ఫ్లాప్ హీరో ఆసక్తి కనబరచడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఒకవేళ ఆ ఫ్లాప్ డైరెక్టర్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునే దిశలో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం ఇద్దరి ఫేట్ మారుతుంది అనడంలో సందేహం లేదు .అటు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ ఇటు తన సినిమాతో హిట్ చూడాలని పరితపిస్తున్న హీరో ఫేట్ ఈ ఒక్క సినిమాతో మారుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సక్సెస్ కోసం ఆరాటపడుతున్న ఈ ఇద్దరికీ ఈ ఒక్క కథ ఫేటును మార్చేస్తుందేమో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×