E-Paper
Advertisement

యుగానికి ఒక్కడు 2 ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా!

యుగానికి ఒక్కడు 2 ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా!
Advertisement

Andrea Jeremiah :యుగానికి ఒక్కడు.. 2010లో తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ‘ఆయిరత్తిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్ పై ఆర్ రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా.. కార్తీ , రీమాసేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. 2010 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. తెలుగులో ఈ సినిమా పెద్ద కల్ట్ హిట్ మూవీగా పేరు సంపాదించింది. దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సీక్వెల్ వస్తుందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి.

యుగానికి ఒక్కడు స్క్రిప్ట్ పనులు పూర్తి..

దీనికి తోడు అటు దర్శకుడు సెల్వరాఘవన్ కూడా యుగానికి ఒక్కడు సినిమా కథకు కొనసాగింపుగా రెండో భాగం కూడా ప్లాన్ చేశారు. పైగా రెండవ భాగంలో తన తమ్ముడు ప్రముఖ హీరో ధనుష్ నటిస్తాడని సెల్వరాఘవన్ ముందే ప్రకటించారు కూడా.. పైగా ఈ సినిమా స్క్రిప్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అయితే ధనుష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యం అవుతుందని.. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరిలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో సడన్గా ఈ సినిమాలో తన అద్భుతమైన నటనను కనబరిచిన ఆండ్రియా.. ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి.

సెట్ పైకి అప్పుడే..

Advertisement

ఇకపోతే సినిమా షూటింగ్ అయితే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మొదటి భాగంలో నటించిన వారు ఇందులో నటిస్తారా? అనే అనుమానాలు ఎప్పుడైతే సెల్వరాఘవన్ ధనుష్ ను ప్రకటించారో అప్పటి నుంచే మొదలైన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇప్పుడు ఆండ్రియా చేసిన కామెంట్లు కూడా అభిమానులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు మొదటి భాగంలో చేసిన నటీనటులు రెండవ భాగంలో కనిపిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

also read:భర్త ఫోటో రివీల్ చేసిన తమన్నా.. క్యూట్ జోడీ!

యుగానికి ఒక్కడు సీక్వెల్ పై ఆండ్రియా కామెంట్..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆండ్రియా మాట్లాడుతూ.. “యుగానికి ఒక్కడు 2 సినిమా ఉంటుంది. కానీ నా నుండి ఆశించవద్దు. ఈ సినిమా తెరపైకి వస్తే మంచిదే. కానీ అందులో నేను ఉండను ఎందుకంటే డైరెక్టర్ సెల్వ రాఘవన్ సార్ తో పని చేయడం అంటే అంత సులభమైన పని కాదు.. మొదటి భాగం కోసం మేము సుమారుగా 200 రోజులు షూటింగ్లో పాల్గొన్నాము. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టం వల్లే ఆ తర్వాత నేను చేసిన ఏ పాత్రనైనా చాలా సులభంగా చేయగలిగాను. కానీ యుగానికి ఒక్కడు సీక్వెల్ లో మాత్రం నేను కనిపించను” అంటూ ఆండ్రియా చేసిన కామెంట్లు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికైతే సీక్వెల్ లో తాను ఉండనని క్లారిటీగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. మరి సీక్వెల్ లో ధనుష్ సరసన కొత్త హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related News

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

Big Stories

Advertisement
×