
Amyra dastur (Image credit: Instagram)
అమైరా దస్తూర్.. ఈ పేరు గురించి పరిచయాలు అక్కర్లేదు. మహారాష్ట్ర ముంబై కి చెందిన ఈమె.. 1993 మే 7న జన్మించింది. మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అమైరా దస్తూర్.. ఇసాక్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Amyra dastur (Image credit: Instagram)
అంతేకాదు ఇందులో ఉత్తమ నటన కనబరిచి.. ఉత్తమ నటి తొలి పరిచయం విభాగంలో ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేట్ కూడా అయ్యింది. 2015లో అనేగన్ అనే చిత్రంతో తమిళంలో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇదే చిత్రం డబ్బింగ్ వర్షన్ తో అనేకుడు అంటూ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

Amyra dastur (Image credit: Instagram)
హిందీ, తమిళ్ అంటూ ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించిన ఈమె.. 2018లో తొలిసారి 'మనసుకు నచ్చింది' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటించారు .

Amyra dastur (Image credit: Instagram)
ఆ తర్వాత రాజుగాడు చిత్రంలో చేసి మళ్లీ తెలుగులో కనిపించలేదు. హిందీ, తమిళ్ అంటూ సినిమాలు చేసిన ఈమె అటు వెబ్ సిరీస్ లలో కూడా కనిపించింది.

Amyra dastur (Image credit: Instagram)
కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అమైరా దస్తూ..ర్ తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ తో అభిమానులను అబ్బురపరిచింది

Amyra dastur (Image credit: Instagram)
షోల్డర్ లెస్ ఫ్రాక్ ధరించిన ఈమె తన అందంతో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అమైరా దస్తూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.