E-Paper
Advertisement

SS Thaman Cut Out : నందమూరి తమన్ కటౌట్… దెబ్బకు బాలయ్య అంత ఎత్తుకు ఎదిగావు కదయ్యా

SS Thaman Cut Out : నందమూరి తమన్ కటౌట్… దెబ్బకు బాలయ్య అంత ఎత్తుకు ఎదిగావు కదయ్యా
Advertisement

SS Thaman Cut Out : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ తమన్ ఒకరు. ఒక తరుణంలో తమన్ మ్యూజిక్ కూడా విపరీతంగా బోర్ కొట్టేసింది. అప్పుడు కొంతకాలం మ్యూజిక్ కి గ్యాప్ తీసుకొని తొలిప్రేమ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలోకి వచ్చిన ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఆ మ్యూజిక్ ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసింది. అయితే తమన్ ఎన్ని సినిమాలు చేసినా కూడా బెస్ట్ అంటే మాత్రం అరవింద సమేత వీర రాఘవ అని చెప్పాలి.

తమన్ కెరియర్ లో చేసిన వందవ సినిమా అది. ఆ సినిమా తర్వాత తమన్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. తమన్ రేంజ్ ఎంతలా మారిపోయింది అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చేసిన నాలుగు సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందించాడు. అలానే బాలకృష్ణ కి కూడా వరుస సినిమాలు చేశాడు. ఇప్పుడు తమన్ అఖండ 2 సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్నతరణంలో చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది.

నందమూరి తమన్ కటౌట్

Advertisement

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను అభిమానులు ఓన్ చేసుకుంటారు. ఎస్ ఎస్ తమన్ బాలకృష్ణ సినిమాలకు మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో చాలామంది సోషల్ మీడియాలో అతనిని నందమూరి తమన్ అంటూ ఉంటారు.

ఇది ఎంత బాగా పాపులర్ అయిందంటే ఆఖరికి తమన్ వరకు కూడా ఈ ప్రశంస చేరిపోయింది. అందుకే ఒక ఈవెంట్ లో నందమూరి తమన్ అని స్వయంగా కూడా అతనే చెప్పుకున్నారు. ఇకపోతే నేడు జరగబోయే ఈవెంట్ లో తమన్ కి సంబంధించి అతి పెద్ద కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఇది తమన్ లైఫ్ కి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. దెబ్బకు బాలయ్య అంత ఎత్తుకు ఎదిగావు అని సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు కనిపిస్తున్నాయి.

గ్రేట్ అచీవ్మెంట్ 

Advertisement

ఒకప్పుడు కేవలం సినిమా నటులు మాత్రమే అభిమానులకు ఎక్కువగా తెలిసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో సినిమా తీసిన దర్శకులకి కూడా మంచి గుర్తింపు లభించింది. దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరికీ కూడా అభిమానులు మొదలయ్యారు.

ఇప్పుడు తాజాగా సంగీత దర్శకులకి కూడా అభిమానులు పుట్టుకొస్తున్నారు అని ఈ కటౌట్ చూస్తే చెప్పొచ్చు. మామూలుగా సంగీతం అందరూ వింటూ ఉంటారు కానీ బాలకృష్ణ సినిమాల్లో కీలక పాత్ర వహించే తమన్ ఇలా కటౌట్ కట్టడం అనేది సంగీత దర్శకుడిగా తమన్ కు గ్రేట్ అచీవ్మెంట్.

Also Read: Raju Weds Rambai : నా చేయి ఏమైందని అడుగుతున్నారు, ఎమోషనల్ అయిన దర్శకుడు

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×