E-Paper
Advertisement

Minister Sandhyarani: మహిళతో మంత్రి కొడుకు అసభ్యకర చాటింగ్.. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారంటూ…?

Minister Sandhyarani: మహిళతో మంత్రి కొడుకు అసభ్యకర చాటింగ్.. నిన్ను చాలా మంది ఇష్టపడుతున్నారంటూ…?
Advertisement

Minister Sandhyarani: ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఒక మహిళతో చేసినట్లు చెబుతున్న చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ చాటింగ్‌లో పృథ్వీ ఆమె పట్ల అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ల ప్రకారం.. పృథ్వీ ఆ మహిళతో వ్యక్తిగత సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలో భాగంగా పృథ్వీ.. ‘జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకుండా.. వేస్ట్ చేసుకుంటున్నావ్..’ అని ఆమెను ప్రశ్నించినట్లు ఉంది. అంతేకాకుండా, ఆమెకు అనేక మంది ఇష్టపడేవారు ఉన్నారని.. పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్లు కూడా నిన్ను ఇష్టపడుతున్నారని చెప్పినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

‘నేను చెప్పినట్టు విను.. చాలా మంది నిన్ను ఇష్టపడుతున్నారు’ అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు కూడా చాటింగ్‌లో కనిపిస్తోంది. అయితే, ఈ సంభాషణ కేవలం మెసేజ్‌ల ద్వారా కాకుండా ప్రశాంతంగా మాట్లాడాలంటూ పృథ్వీ ఆమెను కోరినట్లు కూడా ఉంది. అదే చాటింగ్‌లో బాధితురాలుగా చెబుతున్న మహిళ పట్ల పృథ్వీ ప్రవర్తనపై తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నా బర్త్ డే రోజు ఎన్ని సార్లు కాల్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు.. కనీసం నాకు విష్ చేయలేదు’ అంటూ ఆమె నిరాశను పంచుకున్నట్లుగా వైరల్ మెసేజ్‌లలో ఉంది. ఈ మొత్తం సంభాషణల సారాంశం చూస్తుంటే వారిద్దరి మధ్య వ్యక్తిగత పరిచయం, సాన్నిహిత్యం ఉన్నట్లు అర్థమవుతున్నా, పృథ్వీ భాష, సంభాషణ తీరుపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చాటింగ్ వ్యవహారం ప్రస్తుతం వైరల్‌గా మారినప్పటికీ.. ఈ సంభాషణల నిజానిజాల గురించి తెలియాల్సి ఉంది. ఈ చాటింగ్ స్క్రీన్‌షాట్లు మార్ఫింగ్ చేసినవా? లేక నిజంగానే పృథ్వీ, ఆ మహిళ మధ్య జరిగిన సంభాషణలేనా? అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి లేదా ఆమె కుమారుడు పృథ్వీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

Advertisement

ఈ వివాదంపై ఫిర్యాదులు అందిన పక్షంలో లేదా సుమోటోగా కేసు నమోదు చేస్తే.. పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అంశం రాష్ట్రంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్తై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×