E-Paper
Advertisement

Andhra King Taluka: థియేటర్‌లో అమ్మాయికి ముద్దు… అలాంటి ఎక్స్‌పీరియన్స్‌పై డైరెక్టర్ ఓపెన్ కామెంట్

Andhra King Taluka: థియేటర్‌లో అమ్మాయికి ముద్దు… అలాంటి ఎక్స్‌పీరియన్స్‌పై డైరెక్టర్ ఓపెన్ కామెంట్
Advertisement

Andhra King Taluka: మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిన్న విడుదలైంది. సినిమా మొదటి షో పడినప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం అనేది మొదలైంది. అయితే ఆ సినిమాకు సంబంధించి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రావడం అనేది మంచి ప్లస్ అయింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ చేసిన ఏ సినిమా కూడా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మంచి సక్సెస్ అందుతుంది అని చాలామంది స్ట్రాంగ్ గా నమ్మారు. ఆ నమ్మకం నిజమైపోయింది. నిన్న చాలాచోట్ల ఈ సినిమాకు సంబంధించి హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

Advertisement

ఈ సక్సెస్ ప్రెస్ మీట్ కు నిర్మాత రవి శంకర్ శంకర్, ఉపేంద్ర, దర్శకుడు మహేష్ బాబు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వీళ్ళు ఈ సక్సెస్ మీట్ లో కనిపించలేదు.

థియేటర్‌లో అమ్మాయికి ముద్దు

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనేది ఒక అభిమాని మరియు ఆ హీరోకి మధ్య జరిగే జర్నీ గురించి ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రొజెక్షన్ రూమ్ లో నుంచి హీరోయిన్ మరియు హీరో సినిమా చూస్తూ ఉంటారు. అదే తరుణంలో ఇద్దరు ముద్దుపెట్టుకుంటారు. ఆ ముద్దు పెట్టుకోవడం అనేది ప్రొజెక్షన్ ముందు పెట్టుకోవడం వల్ల అది స్క్రీన్ పై కనిపిస్తుంది.

Advertisement

ఇక్కడితోనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఈ సీన్ గురించి నేడు జరిగిన ప్రెస్ మీట్ లో ఒక ప్రముఖ జర్నలిస్ట్ దర్శకుడు మహేష్ బాబుని అడిగారు. ఆ సీన్ చేశారు కదా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడిగారు. ఖచ్చితంగా ఉంటుంది కదండీ అంటూ మహేష్ బాబు సమాధానం చెప్పాడు. మీరు కూడా అలా చేసే ఉంటారు కదా అని ఆ రిపోర్టర్ ని కూడా మొహం మీదే అడిగాడు.

ఏం అడగాలో తెలియక 

ఇకపోతే కొంతమంది జర్నలిస్టులు ప్రవర్తించే తీరు మరి దారుణంగా తయారయింది. ముందు కొంతమంది సెలబ్రిటీలు కనిపిస్తే వాళ్లను ఏం అడగాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతున్నారు. సినిమాలో సన్నివేశాన్ని ప్రెస్ మీట్ లో తీసుకొచ్చి రియల్ లైఫ్ లో అలా ముద్దు పెట్టారా అని అడగడం చాలా దారుణమైన విషయం.

కేవలం ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా జర్నలిస్టులు, సెలబ్రిటీలను ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే అందరూ ఇలా ఉంటారని చెప్పలేము కొందరికి కనీసం జ్ఞానం కూడా లేకుండా ఇలా అడగడం అనేది చాలా దారుణమైన విషయం అనేది కొంతమంది నెటిజన్ల అభిప్రాయం.

Also Read: Raju Weds Rambai : నా చేయి ఏమైందని అడుగుతున్నారు, ఎమోషనల్ అయిన దర్శకుడు

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×