Guess The Actress : ఈమధ్య సినీ తారల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలను చూడటానికి అభిమానులు ఆసక్తి చూపడంతో నెట్టింట ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. కేవలం యంగ్ హీరోయిన్లు మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్ల ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలో స్టార్ హీరోయిన్ మాస్క్ తో కనిపిస్తుంది. ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. ఇంతకీ ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? చివరగా తెలుగులో మోహన్ బాబుతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది..
మాస్క్ తో ఉన్న హీరోయిన్ స్టార్ హీరో భార్య..
ఇప్పటికైన ఎవరో గుర్తు పట్టారా..? అవును మీరు గెస్ చేసింది అక్షరాల నిజమే.. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కుమందీ అందాల తార. మాస్క్ ధరించి కెమెరాలకు కనిపించింది. మాస్క్లో ఉన్నా కూడా ఆమె అభిమానులు గుర్తుపట్టారు.. ఆమెతో ఫోటోలు, ఆటో గ్రాఫ్ లు తీసుకున్నారు.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంత వయస్సులో కూడా కుర్రహీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఈమె సొంతం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక 90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఈమెకు బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండోయ్. గతంలో బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబులతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ సొగసరి ఇప్పటికీ పాన్ ఇండియా లెవల్ సినిమాలు చేస్తుంది. హీరోయిన్ కాకపోయినా అంతకుమించి రెమ్యూనరేషన్ ను అందుకుంటుంది..
Also Read : Illu Illalu Pప్రేమ లైఫ్ లో మరో వ్యక్తి.. ఫోటోలను చూసి ప్రేమ షాక్.. శ్రీవల్లికి అనుమానం..
సినిమాల విషయానికొస్తే..
బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్స్ ఇప్పుడు కుర్ర హీరోయిన్లకు పోటీ తీస్తూ తన అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం తన సినిమాల గురించి చూసుకుంటూనే, ఫ్యామిలీని చూసుకుంటుంది. అంతేకాదు తాను కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF సినిమా లో ఈ అమ్మడు పోషించిన రమికాసేన్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం మంచి హోప్ ఉన్న పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. అటు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతాయో చూస్తూనే ఉంటాము..