BigTV English

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ లైఫ్ లో మరో వ్యక్తి.. ఫోటోలను చూసి ప్రేమ షాక్.. శ్రీవల్లికి అనుమానం..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ లైఫ్ లో మరో వ్యక్తి.. ఫోటోలను చూసి ప్రేమ షాక్.. శ్రీవల్లికి అనుమానం..

Illu Illalu Pillalu ToIlluday Episode August 27th : నిన్నటి ఎపిసోడ్ లో..తిరుపతి చేతికి చెంబు తగిలించుకొని ఊరిలో వెళుతూ ఉంటే అందరూ ఈ చెంబు ఏంటి అని అడుగుతారు.. నాకు అర్జెంట్గా ఆకలేస్తుంది అని అనుకుంటాడు అంతలోపే ఇడ్లీ సాంబార్ రండి రండి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి బాబు నాకు ఒక ఇడ్లీ వడ ఇవ్వవా అని అడుగుతాడు. ఆనంద్ రావు ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఏంటి ఇడ్లీ అన్నయ్ నువ్వు ఇడ్లి నమ్ముతున్నావేంటి అని అడుగుతాడు.. ఆస్తులు పోయాయి కదా ఇక ఇడ్లీలు అమ్ముకోవాలి అని అంటాడు. అన్నయ్ నువ్వు ఈ ఇడ్లీ బిజినెస్ చేస్తుందో చూస్తుంటే నీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లు లేదు ఎన్నో ఏళ్ల నుంచి అనుభవం ఉన్నట్లు చేస్తున్నావని ఆనందరావు తిరుపతి అడుగుతాడు.. మొత్తానికి ఆనందరావు తిరుపతిని బురిడీ కొట్టిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అన్ని సమస్యలు తీరిపోయాయని భాగ్యం ఆనందరావు సంతోషంగా ఉంటారు. భాగ్యం ఆనందరావు మనం ఇక దాచాల్సిన అవసరం లేదు మన ఆస్తులు పోయాయి. మన వ్యాపారం ఇదే అని చెప్పుకోవాల్సింది. ఇక నువ్వెందుకు టెన్షన్ పడతావు ఆ ప్రేమ నర్మదా ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అయితే అప్పుడే శ్రీవల్లి వచ్చి ఈ సమస్య ఎక్కడ పోయింది మా ఆయనకు మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు అలాగే ఉండిపోయాయి ఆయన నాతో మాట్లాడుతున్నాడా? నాకు కాపురం కూలిపోయేలా ఉంది అని బాధపడుతుంది. ఆ ప్రేమ, నర్మదాల గురించి ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది వాటిని బయట పెడితే మనం ఎస్కేప్ అవ్వచ్చు అని భాగ్యం అంటుంది. ముగ్గురు కలిసి భారీ ప్లానే వేస్తారు.

తిరుపతి ఊర్లో రంగు వేసుకుంటే అందరికీ తెలుస్తుందని పక్కకు వెళ్లిన విషయాన్ని తన అల్లుళ్ళతో పంచుకుంటాడు.. అక్కడ ఒక అమ్మాయిని చూసిన విషయాన్ని కూడా చెప్పి సంతోషంగా మురిసిపోతుంటాడు.. అయితే ముగ్గురు అల్లుళ్ళు కూడా మావని ఈ వయసులో పెళ్లి ఏంటి అని ఎగతాళి చేస్తూ ఉంటారు.. ఒక అమ్మాయికి నేను లెటర్ రాశాను ఆ అమ్మాయి దగ్గర కలుద్దామని వెళ్తే చెంబును చూసి ఏంటని అడుగుతుందని లెటర్ రాశాను మరి లెటర్ కి రిప్లై వస్తుందా రాదా అని ఎదురుచూస్తున్నాను అల్లుళ్లు అని తిరుపతి అంటారు.


అప్పుడే పోస్ట్మాన్ లాగా ప్రేమ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు.. ఆ లెటర్ ని తిరుపతి తీసుకొని ఇది నాకోసమే వచ్చిందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఊరంతా తెలిసి ఎవరో ఒకరికి తీసుకున్నారులే ప్రేమకి తెలిసిపోతుంది కదా అని అతను అనుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆ లెటర్ నేనేం చదువుతాను నేను చదువుతాను ఇంట్లో వాళ్ళందరూ తీసుకుంటారు కానీ చివరికి ప్రేమ ఆ లెటర్ ని తీసుకొని నేను చదువుతానని ఓపెన్ చేస్తుంది. అందులో ఫోటోలు ఉండడం చూసి షాక్ అవుతుంది.. ఆ ఫోటోలను చూసి ఇది లెటర్ కాదు నాకోసం వచ్చిన అవి అని అంటుంది.

నీకోసం లెటర్ వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది అని ధీరజ్ అడుగుతాడు. కాలేజీ నుంచి వచ్చింది అని ప్రేమ అబద్ధం చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది.. అయితే ఆ ఫోటోలను చూస్తున్న ప్రేమ దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. వెంటనే ప్రేమకు ఫోన్ రావడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ అని తెలుసుకొని షాక్ అవుతుంది.. నువ్వేంటి రా ఇన్నాళ్లకు ఫోన్ చేసావని అడుగుతుంది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది.

ఆరు నెలలకు ఒక అమ్మాయిని డ్రాప్ చేసి ప్రేమించి వాళ్ళని అమ్మేసి డబ్బులు తీసుకొని జల్సాలు చేసే వాడిని.. కానీ నీ వల్ల అదంతా మారిపోయింది ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యకపోతే ఆ ఫోటోలను నీ మామ రైస్ మిల్లులకు పంపిస్తాను అని అంటాడు.. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నిన్ను నమ్మి నేను ప్రేమించి నా పుట్టింటికి నేను దూరమైపోయాను అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా కూడా కరగని కళ్యాణ్ నేను చెప్పినట్లు వినకపోతే ప్లెక్సీలు వేసి ఇస్తాను అంటాడు.

నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే అదే జరుగుతుంది అని ప్రేమకు వార్నింగ్ ఇస్తాడు.. తన మాట విన్న ప్రేమ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ లోపలికి వస్తాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావ్ ఏమైంది అని అడుగుతాడు. కానీ ప్రేమ మాత్రం టెన్షన్ ఏం లేదు వాష్ రూమ్ లో ఉన్నాను అని అంటుంది. ఇందాక వచ్చిన ఆ లెటర్ ఏంటి అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఎంత చెబుతున్నా కూడా ధీరజ్ వినడు..అతనిపై ప్రేమ సీరియస్ అవుతుంది.

Also Read: పల్లవి, శ్రీయాలకు కమల్ షాక్..అవని రాకతో ఇంట్లో కళ.. పార్వతికి కరెంట్ షాక్..

సాగర్ నర్మదా ఇద్దరు కూడా బైకుపై సరదాగా వెళ్తుంటారు.. అయితే సాగర్ బండి నడపడం చూసి నర్మదా నాకేంటి టార్చర్ అని అంటుంది. మనము చాలా రోజుల తర్వాత ఇలా వస్తున్నాం కదా… నాకు చాలా సంతోషంగా ఉంది అని సాగర్ అంటాడు. ఎప్పుడూ నాన్న నాన్న అంటావ్ కదా అందుకే ఇన్నాళ్లకు మనం ఇలా రావాల్సి వచ్చింది అని అంటుంది నర్మదా.. ఇద్దరూ కలిసి సరదాగా బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నర్మదా సాగర్ చేస్తున్న చిత్ర విచిత్రాలకి ఈరోజు సునామీ తుఫాను అన్ని వచ్చేలా ఉన్నాయని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Brahmamudi Serial Today August 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌కు నిజం చెప్పిన అపర్ణ – షాక్‌లో యామిని, రుద్రాణి

Intinti Ramayanam Today Episode: పల్లవి, శ్రీయాలకు కమల్ షాక్..అవని రాకతో ఇంట్లో కళ.. పార్వతికి కరెంట్ షాక్..

GudiGantalu Today episode: సంజయ్ కు దిమ్మతిరిగే షాక్.. కారు కొన్న మనోజ్.. రోహిణికి దారుణమైన అవమానం..

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మాటలు విన్న అమర్‌

Serial Hero : ‘సత్యభామ ‘ హీరో జీవితంలో అన్నీ కష్టాలే.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Big Stories

×