E-Paper
Advertisement

Star Producers: నైజాం ఏరియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్స్.. ఎందుకింత డిమాండ్?

Star Producers: నైజాం ఏరియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్స్.. ఎందుకింత డిమాండ్?
Advertisement

Star Producers: సినిమా బాక్స్ ఆఫీస్ కి అతిపెద్ద ఆదాయ వనరుగా నిలిచిన నైజాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చాలామంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడి నుంచే సినిమాలను ప్రదర్శిస్తూ భారీ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు ఇక్కడ తమ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లను ఓపెన్ చేయగా.. ఇప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నిర్మాత ధీరజ్ మొగలినేని కూడా తాజాగా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ను ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈయనకు ఆంధ్ర, సీడెడ్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈయన మరో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును ఏకంగా నైజాం ఏరియాలో ఓపెన్ చేస్తున్నారు. దీనికి తోడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇకపోతే ఇలా వరుస పెట్టి నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తుండగా.. ఎందుకు నైజాం ఏరియాపై స్టార్ ప్రొడ్యూసర్లు అందరూ కన్నేశారు..? ఆ ప్రాంతానికి ఎందుకు ఇంత డిమాండ్? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నైజాం ఏరియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్లు..

సాధారణంగా నైజాం ఏరియా అనగానే ప్రతి ఒక్కరికి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గుర్తుకొస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాల నిర్మిస్తున్న ఈయన.. ఇండస్ట్రీలో నిర్మాతగా మారకముందు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు దక్కించుకున్నారు. మరోవైపు నైజాం ఏరియాలో ఒక చిత్రం విడుదలవుతోంది అంటే అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఎక్కువ చిత్రాలను ఆయనే సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇక అలా భారీగా లాభాల బాట పట్టిన విషయం తెలిసిందే.

నైజాం ఏరియాలో కొత్త ఆఫీస్ తెరవనున్న ధీరజ్..

Advertisement

అందుకే దిల్ రాజుకు పోటీగా ఈ నైజాం ఏరియాలో ఏషియన్ సునీల్, మైత్రి మూవీ మేకర్స్ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లను ఓపెన్ చేశారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియో వాళ్లు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ధీరజ్ మొగిలినేని కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తుండగా.. మరి రెండు రోజుల్లో ప్రైమ్ షో వాళ్లు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా వరుస పెట్టి నిర్మాతలంతా నైజాం ఏరియాపై కన్ను వేయడంతో అభిమానులే కాదు సినీ లవర్స్ అందరూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Star Actor: బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. ముసుగులో మోసం!

సినిమా రంగానికి అతిపెద్ద మార్కెట్ నైజాం..

Advertisement

అయితే ఇంత డిమాండ్ పెరగడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా నైజాం ఏరియా కింద తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ తో పాటు మరికొన్ని ప్రాంతాలు వస్తాయి.. ఇవన్నీ కూడా జిల్లాలు కావడం ఇక్కడ పదుల సంఖ్యలో థియేటర్లు… ప్రేక్షకుడికి మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ సినిమా చూడడానికి ఆడియన్స్ ఏ రేంజ్ లో అయితే ఆసక్తి కనబరిస్తున్నారో.. ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి.. సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేసి సినిమాలను ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నారు..

ఎందుకింత డిమాండ్?

అయితే ఇక్కడ ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏమిటి అంటే నైజాం ఏరియా అనేది అతిపెద్ద సినీ మార్కెట్. సినీ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్ లు ఉండడమే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మార్కెట్ గా నిలుస్తోందని చెప్పవచ్చు. దీనికి తోడు నైజాం ఏరియాలో సినిమా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను బాగా ఆశిస్తారు.. ఇది డిస్ట్రిబ్యూటర్లకు మరింత ఆదాయాన్ని అందిస్తోంది. నైజాం ఏరియా సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో ముఖ్యమైన భాగం అని చెప్పాలి. ఇక్కడ సినిమా విజయం అయ్యిందంటే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సంఖ్యలో ఆర్థిక లాభం వస్తుంది.

చిన్న సినిమాల పేరిట భారీ లాభం

అంతేకాదు హైదరాబాదులో పెద్ద పెద్ద సినిమా నిర్మాణ సంస్థలు ఉండడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు సినిమా హక్కులను పొందడానికి మరింత సులభం అవుతుందనే చెప్పాలి. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న సినిమాల పేరు చెప్పి సుమారుగా 25 లక్షలు చార్జ్ చేస్తున్న కొన్ని సంస్థలకు ఇది బాగా లాభం అని చెప్పవచ్చు. అలా నైజాం ఏరియాలో ఈ లాభాల కోసమే వరుస పెట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు నిర్మాతలు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×