E-Paper
Advertisement

Chhattisgarh: నారాయణపూర్‌లో మావోయిస్టుల స్మారక స్థూపం ధ్వంసం చేసిన భద్రతా బలగాలు!

Chhattisgarh: నారాయణపూర్‌లో మావోయిస్టుల స్మారక స్థూపం ధ్వంసం చేసిన భద్రతా బలగాలు!
Advertisement

Chhattisgarh:  నారాయణపూర్ స్వేచ్ఛ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల స్మారక స్థూపాన్ని భద్రత బలగాలు ధ్వంసం చేశాయి. నారాయణపూర్ జిల్లా పరిధిలో మావోయిస్టుల అప్రకటిత రాజధానిగా పేరుగాంచిన కుతుల్ ప్రాంతంలో భద్రతా దళాలు కీలక చర్య చేపట్టింది. కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరస్గావ్ గ్రామంలో నక్సలైట్లు నిర్మించిన భారీ స్మారక చిహ్నాన్ని భద్రతా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. సేవ్ మాడ్” ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది జెసిబి యంత్రాన్ని ఉపయోగించి నక్సలైట్ స్మారక చిహ్నాన్ని కూల్చివేశారు. నక్సల్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా ఈ చర్య కీలకంగా మారిందని అధికారులు తెలిపారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు భద్రతా దళాలు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మావోయిస్టులపై భద్రత బలగాల ముప్పేట దాడి

మావోయిస్టులపై కేంద్ర భద్రత బలగాలు ముప్పేట దాడి చేపట్టాయి. ఓవైపు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న బీజాపూర్ జిల్లా పూజారి కాంకేరి ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పరచుకున్న భారీ బంకర్ ప్రాంతంలో ఇటీవలనే ఎన్కౌంటర్ జరిగింది. ఆ దాడిలో దాదాపు పదికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా వార్తలు ప్రసారం అయ్యాయి. మరోవైపు మహారాష్ట్ర-చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతాబలగాలు మావోయిస్టు చర్యలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

Advertisement

Also Read: Black Magic Allegation: టీడీపీ ఎమ్మెల్యేపై క్షుద్రపూజలు? ఇంటి ముందు నిమ్మకాయలు.. ఏపీలో తీవ్రకలకలం!

9 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి

గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై నిఘా వేసి మంగళవారం రాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ తో నిత్యం కుంబింగ్ లను నిర్వహిస్తున్నారు. పోలీసులపై దాడికి తెగబడిన మావోయిస్టులపై భద్రత బలగాలు సైతం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ కు గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి ఏకే 47, ఎస్ ఎల్ ఆర్ రైఫిళ్ళతో పాటు మరికొంత మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు నారాయణపూర్ జిల్లాలోని ప్రతి ప్రాంతాన్ని అణువణువున భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మావోయిస్టులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన, స్మారక స్థూపాలు దర్శనమిచ్చిన వెంటనే వాటన్నింటిని ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.

టార్గెట్ దగ్గర పడుతున్న కొద్ది యాక్షన్ ప్లాన్ స్పీడ్

Advertisement

నక్సల్స్ ఫ్రీ ఇండియాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ కగార్ లో టార్గెట్ మార్చి 31, 2026 దగ్గర పడుతున్న కొద్ది భద్రతా బలగాలు తమ యాక్షన్ ప్లాన్ లను స్పీడ్ అప్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలతో దండకారణ్యాలను జల్లెడ పడుతున్నారు. తాజాగా శుక్రవారం 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో స్ట్రాంగ్ కార్యకలాపాలను నిర్వహించే వారిపై భద్రతా బలగాలు ఉక్కు పాదం మోపుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలతో నిత్య పర్యవేక్షణలో ఎస్ఐబి నిఘాతో భద్రతాబలగాలు తమ కార్యాచరణను పకడ్బందీగా సాగిస్తున్నాయి.

భద్రతా బలగాలు అహర్నిశలు కృషి

మావోయిస్టులను మొత్తం మట్టుపెట్టే వరకు భద్రతా బలగాలు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ నాయకులు, దండకారణ్యంలో ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టులపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే టార్గెట్ మార్చి 31, 2026 మాత్రమే భద్రతా బలగాలకు ముందున్న లక్ష్యం.

Also Read: Jangaon District: ఆ జిల్లాలో పెద్దపులి హడల్.. రాత్రి బయటికి రావొద్దు ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక!

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×