Bigg Boss 10: బిగ్ బాస్ 10లో కనీవినీ ఎరుగని ఊహించని ట్విస్టులు ఆడియన్స్ కు సరికొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇకపోతే ఏడవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మరింత హీట్ పుట్టిస్తోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ నామినేషన్ వార్ ను మరింత హీటెక్కిస్తున్నారు. తాజాగా 44వ రోజుకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో నీతూ, వర్షిణి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కంటెస్టెంట్లు ఒకరిని మించి మరొకరు దూషించుకోవడం మాటలు జారడం ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో అమన్ శివను నామినేట్ చేస్తూ వైల్డ్ ఫైర్ లా వచ్చి వైల్డ్ ఫూల్ అయ్యావు అంటూ జరిగిన టాస్క్ గురించి వివరిస్తూ నామినేట్ చేశాడు. నలుగురు డిస్కషన్ చేసుకునేటప్పుడు మీ మాటలు ఎలా ఉంటాయి అంటే.. మధ్యలో వచ్చే అగ్గిపుల్ల గీసి సైలెంట్ గా వెళ్ళిపోతారు. మీరు అన్నారు.. నేను అన్నాను.. ఒక్కళ్ళే ఆడాలని అని అమన్ చెబుతుండగానే.. త్రిగుణ్ మధ్యలో దూరి.. నీకంటే బెటర్ గా ఫస్ట్ వీక్ శివ ఆడాడు అంటూ చెప్పాడు. దీంతో అమన్ అసలు నిన్ను ఎవడు అడిగారన్న అంటూ ఫైర్ అయ్యాడు.
తర్వాత నిన్నటి ఎపిసోడ్లో నీతూ ఎలా అయితే నీ గేమ్ కనిపించట్లేదు.. ముఖేష్ ని వాడుకొని నువ్వు హౌస్ లో సర్వైవ్ అవుతున్నావు, అసలు నువ్వు ఆడడం మొదలు పెట్టు అంటూ వర్షిణిని నామినేట్ చేసింది. అయితే ఇప్పుడు నేటి ఎపిసోడ్లో వర్షిణి వంతు వచ్చింది. వర్షిణి నీతూని నామినేట్ చేస్తూ.. బయట నుంచి మీరు ఏదైతే మెసేజ్ తీసుకొని వచ్చారో అది ఎవరికీ పాస్ చేయొద్దు అని మీరే చెప్పారు కదా అని అంటుండగానే .. నీతూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. కానీ వంశీ నీతూ ను టార్గెట్ గా చేసుకొని బయట నుంచి వచ్చిన విషయాలను నా తమ్ముడికి చెప్పుకుంటానని మీరే కదా రోహిత్తో చెబుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. రోహిత్ నన్ను చూడు అంటూ వర్షిని చెబుతుండగానే వంశీ మాట్లాడుతూ పప్పెట్ తిన్న పప్పీ నువ్వు అంటూ రోహిత్ పై ఫైర్ అయ్యాడు.
ALSO READ: ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?
ఇక నీతూ ఫైర్ అవుతూ లాస్ట్ ఆ గేమ్ లో గోడ కూడా నువ్వు ఎక్కలేకపోయావు అని అంటే.. వర్షిణి అసలు నువ్వేం పీకావో చెప్పు అంటూ నోటి మాటలు జారింది. నేను గేమ్ ఆడట్లేదు పర్సనాలిటీ చూపించుకోవడానికి వచ్చానని చెప్పిందా ఆవిడ అని నీతూ మిగతా వాళ్లతో చెబుతుంటే.. దమ్ముంటే నాతో మాట్లాడు అంటూ ఫైర్ అయ్యింది. ఇక నీతూ గేమ్ ఆడే దమ్ము నీకు లేదు అని అంటుండగానే.. మధ్యలో రాంప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకు నువ్వు మధ్యలోకి వచ్చావు అంటూ వర్షిని రాంప్రసాద్ పైన కూడా అరిచేస్తుంది. ఇక రాంప్రసాద్ మాట్లాడుతూ ఒక కెప్టెన్ గా నేను ఇన్వాల్వ్ అవుతాను అంటూ అనడం.. అటు విష్ణుప్రియ ఫైర్ అవడం వైరల్ గా మారింది. మొత్తానికైతే ఈ నామినేషన్ లో కంటెస్టెంట్స్ ఒకరికొకరు నోరు జారడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.