Aadarsha kutumbam:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన చిత్రం ఆదర్శ కుటుంబం ఏకే 47. ఎప్పుడో అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఏకంగా రెండు మూడుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం ను మేకర్స్ లాక్ చేశారు.
ఇకపోతే ఆదర్శ కుటుంబం ఏకే 47 అక్టోబర్ 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. 2 గంటల 29 నిమిషాల అఫీషియల్ రన్ టైంను మేకర్స్ లాక్ చేశారు. పైగా ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ లభించింది. ఇకపోతే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని , సెకండ్ హాఫ్ పరవాలేదని , కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తమ అభిప్రాయాన్ని తెలియజేశారట.
ఇకపోతే సినిమా చూసిన తర్వాత అందులోని కొన్ని అంశాలను సెన్సార్ సభ్యులు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదర్శ కుటుంబంలో వెంకటేష్ దొంగ పాత్రలో నటిస్తున్నారట. ఇక ఏకే 47 హౌస్ లో వీరంతా ఏం చేస్తారు? పోలీసులు చేసిన సెటప్ ఏంటి ? అనేదే ఆదర్శ కుటుంబం కథ అన్నట్టు సమాచారం. మొత్తానికైతే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్బ్ గా ఉందని, సెకండ్ హాఫ్ కాస్త తగ్గినా వర్కౌట్ అయిందని, బిగ్ హిట్టు మూవీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా, దర్శకత్వంలో రాబోతున్న తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ , హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. ఇకపోతే ఇందులో వెంకటేష్ చిట్టి బాబుగా నటిస్తుండగా.. శ్రీ నిధి శెట్టి స్వర్ణ పాత్రలో ఆకట్టుకోబోతున్నారు. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్గా మెప్పించడానికి సిద్ధమయ్యారు. వెన్నెల కిషోర్, నివేథా పేతురాజు , సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ , యువినా పార్థవి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.