E-Paper
Advertisement

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
Advertisement

Jhansi Hotel: హోటల్‌లో కొత్త దంపతుల మధ్య ఏం జరిగింది? గది నుంచి బయటకు ఎలా పడిపోయింది? ఎవరైనా ఆమెని చంపేశారా? హోటల్‌లో రికార్డయిన సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా వధువు భర్తను పోలీసులు విచారణ చేపట్టారు. సంచలన రేపిన ఈ ఘటన యూపీలోని వెలుగులోకి వచ్చింది. అసలు దంపతుల మధ్య ఏం జరిగింది?

యూపీలోని ఓ హోటల్‌లో షాకింగ్ ఘటన

మధ్యప్రదేశ్‌లోని విదిశాకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ నిలేష్‌తో ముస్కాన్‌కు జూన్ 29 వివాహం జరిగింది. ముస్కా‌న్‌కు దాదాపు వయస్సు 28 ఏళ్లు ఉంటాయి. అక్టోబర్ 28న రైల్వే ఎగ్జామ్ ఉండడంతో ముస్కాన్ అందుకు రెడీ అవుతోంది. పరీక్షల నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి పుట్టింట్లో ఉంటోంది. 23న అంటే శుక్రవారం అల్లుడు నీలేష్ అత్తగారి ఇంటికి వచ్చాడు. మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఝాన్సీలోని రిషభ్ హోటల్‌కి భార్యని తీసుకెళ్లాడు.

రూమ్ లోకి వెళ్లగానే వధువు మృతి, కేవలం 6 సెకన్ల వ్యవధిలో

Advertisement

అక్టోబర్ 24న హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యే సమయంలో ముస్కాన్ గది నుంచి బయటకు వచ్చే క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కేవలం 6 నుంచి 10 సెకన్ల వ్యవధిలో ఏం జరిగింది? వెంటనే హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో ముస్కాన్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.

ముస్కాన్ గదిలోకి వెళ్లి కింద పడిపోవడం అందులో రికార్డు అయ్యింది. కూతురు సడన్‌గా మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇది ముమ్మాటికీ హత్య అని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిలేష్‌కు పెళ్లైన విషయం దాచి మరొక పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. పోలీసులు భర్త నిలేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement

ALSO READ: అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే

పెళ్లి తర్వాత తన భర్త ఇదివరకే పెళ్లయిందని ముస్కాన్‌కు తెలిసింది. మొదటి భార్య ఇండోర్‌లో నివసిస్తోందని కూడా తెలుసు. ఈ క్రమంలో తమ కూతుర్ని భర్త తరచూ వేధింపులకు గురి చేసేవాడని మృతురాలి తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ ఆరోపించారు. వధువు కుప్పకూలడానికి ముందు ఏమి జరిగింది? ఆమె తలపై ఉన్న గాయాలకు- మరణానికి సంబంధం ఉందా? లేదా? అనేది నిర్ధారించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

 

 

Related News

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు

అప్పులు తీర్చి, గర్ల్‌ఫ్రెండ్‌తో తిరిగేందుకు.. కిడ్నాప్ డ్రామా ఆడిన నీట్‌ స్టూడెంట్!

గుట్కా ఉమ్ముతూ విద్యుత్ వైర్లపై.. బాల్కనీలో అసలు ఏం జరిగింది? మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

ఘోరమైన యాక్సిడెంట్.. లోయలోపడిన బస్సులో 30 మంది, వీడియోలో కాపాడాలంటూ ఆర్తనాదాలు

Big Stories

Advertisement
×