E-Paper
Advertisement

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?
Advertisement

Tiger Shroff:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై కాల్పుల ఘటనలు అందర్నీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ధైర్యంగా బహిరంగ ప్రదేశాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం. ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్టోబర్ 18వ తేదీన ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే జుహూ ఏరియాలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ నుండి తన కారులో బయటకు వస్తున్న టైగర్ ష్రాఫ్ పై గుర్తు తెలియని దుండగులు ఏకంగా 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో తప్పించుకోగా.. ఆయన డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టైగర్ ష్రాఫ్ వెంటనే బయటపడి గాయపడిన వారిని తన కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు..

ఇకపోతే ఈ ఘటనతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టైగర్ ష్రాఫ్ పై దాడి తమ పనే అని కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అంతేకాదు సల్మాన్ ఖాన్ తో ఎవరు సన్నిహితంగా ఉన్నా సరే వారిని లక్ష్యంగా చేసుకుంటామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఇకపోతే టైగర్ ష్రాఫ్ పై జరిగిన దాడి తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నాక.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కూడా పరామర్శించి దుండగులను వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే కాల్పులు జరిపి పారిపోయిన నిందితులను సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

also read:చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

లగ్జరీ అపార్ట్మెంట్ ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్..

ఇకపోతే బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు, తదితర పరిణామాలతో టైగర్ ష్రాఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని తన అపార్ట్మెంట్ ను అమ్మేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 18న తనపై జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న కొద్ది రోజులకే అక్టోబర్ 22వ తేదీన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తన ఇంటిని సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలకు అమ్మేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. టైగర్ ష్రాఫ్ అపార్ట్మెంట్ ఖార్ వెస్ట్ లోని రుస్టోమ్ జీ పారామౌంట్ డీ కో – ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని తొమ్మిదవ అంతస్తులో ఉంది. రెండు కవర్డ్ కారు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. పైగా 1291.14 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఫ్లాట్ లావాదేవీల కోసం సుమారుగా రూ.54 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రాణభయమా?

Advertisement

ఇకపోతే ఇంత అకస్మాత్తుగా టైగర్ ష్రాఫ్ తన అపార్ట్మెంట్ను అమ్మేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రాణభయంతోనే ఈ అపార్ట్మెంట్ను అమ్మేశారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కాల్పులు జరిపిన కొన్ని రోజులకే టైగర్ ష్రాఫ్ తన అపార్ట్మెంట్ను అమ్మేయడం వెనుక అసలు కారణం పై స్పందిస్తారో లేదో చూడాలి.

Related News

ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

Big Stories

Advertisement
×