Aadarsha Kutumbham Trailer: విక్టరీ వెంకటేష్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbham). త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అందరితో సినిమాలు చేశారు కానీ వెంకటేష్ తో ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. వెంకటేష్ సినిమాల కోసం గతంలో ఈయన డైలాగ్ రైటర్ గా, కథ రచయితగా పనిచేశారు కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ మాత్రం సినిమా చేయటం ఇది మొదటిసారి. ఇలా మొదటిసారి వీరి కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఇలా అక్టోబర్ రెండో తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
తాజాగా చిత్ర నిర్మాతలు ఆదర్శ కుటుంబం ట్రైలర్ (Aadarsha Kutumbham Trailer)విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేశారు. ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ అక్టోబర్ 23వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు. అయితే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియచేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మల్లారెడ్డి విశ్వవిద్యాపీత్ గ్రౌండ్ హైదరాబాద్ లో జరగబోతున్నట్లు తెలియజేశారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.
Bringing FAMILY, FUN & FULL-ON ENTERTAINMENT!! 💥🕺#AadarshaKutumbam TRAILER OUT TOMORROW! 🔥🔥
📍 Malla Reddy Vishwavidyapeeth, Maisammguda, Kompally, Hyderabad from 5:00 PM Onwards! 😎🥳
In Cinemas #AK47FromOct30th | #AK47 | #Venky77 | #VenkateshXTrivikram
Victory… pic.twitter.com/8AbxxUG5BN
— Haarika & Hassine Creations (@haarikahassine) October 22, 2026
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు అలాగే టీజర్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ అప్డేట్స్ సినిమా మంచి అంచనాలనే పెంచేసాయి. మరి ఈ సినిమా నుంచి విడుదల చేసే ట్రైలర్ ఎలా ఉండబోతోందనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమా విడుదలకు ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరచూ వాయిదా పడుతున్న నేపథ్యంలో సినిమాకు ఒక కావలసినంత బజ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడం కోసం చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ జనవరి 12 విడుదల సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: ఆరు ముఖాలు కలిగిన బొమ్మ..గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ అప్డేట్!