E-Paper
Advertisement

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?
Advertisement

Adarsha Kutumbam:త్రివిక్రమ్ శ్రీనివాస్ ..ఈయన గారి కలం నుండి జాలువారిన పంచుల ప్రవాహానికి తడిసిముద్దవని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి లేదు. తనదైన ప్రాసలతో తెలుగు సినిమా డైలాగ్ డిక్షన్ నే మార్చేసిన క్రేజీ రైటర్ కమ్ డైరెక్టర్.అలాంటి డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎంతలా ఎదురుచూసే వారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక గురూజీ సినిమాలలో వినబడే పాటలకి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది కూడా.

అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం మాత్రం పాటల విషయంలో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అవును ..ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలూ సో సో గానే ఉండటంతో అసలు ఈ పాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోనివేనా అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

Advertisement

నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో మ్యూజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఎదో అలా వచ్చి ఇలా పోయేలా కాకుండా స్టోరీకి సరిపోయేలా ,మీనింగ్ ఫుల్ గా ఉంటూ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆయన సినిమాల్లోని పాటలు చాలాసార్లు సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. దీనికి బేస్ట్ ఎగ్జాంపుల్ అల వైకుంఠపురములో సినిమానే చెప్పొచ్చు.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో తమన్ ఇచ్చిన బుట్టబొమ్మ, రాములో రాములా వంటి పాటలు ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి.

ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మ్యూజిక్ ఎంత బాగా కుదిరిందో యూట్యూబ్ లో ఆ పాటలకొచ్చిన మిలియన్ల వ్యూసే చెబుతాయి. ఇక సో సో అని టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమాలో కూడా కుర్చీ మడతపెట్టి పాట తెలుగు రాష్ట్రాలని ఎలా ఊపేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమా లన్నిటికీ సంగీతం అందించిన తమన్ సారధ్యంలోనే ఆదర్శకుటుంబం కి మ్యూజిక్ జరగడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.కానీ ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన నారాయణమ్మ, మాలా అనే రెండు పాటలు కూడా తమన్ – త్రివిక్రమ్ కాంబో స్థాయిలో లేవన్నది మూవీ లవర్స్ వాదన.

Advertisement

నిజానికి తమన్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో మంచి పాటలను డెలివర్ చేశారు కూడా. అలాంటప్పుడు ఆదర్శ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆ మ్యాజిక్ ఎందుకు రిపీట్ కావట్లేదన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.త్రివిక్రమ్ గత సినిమాలను చూస్తే సంగీత దర్శకులు మారినా పాటల విషయంలో గురూజీ స్టాంప్ ఎలా ఉంటుందో ఆ పాటలకి వచ్చిన అప్లాజ్ బట్టే అర్థమవుతుంది.

నిజానికి సినిమాకు బజ్ తీసుకురావడంలో పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ సో సో గా జరిగినా ఒక్క సాంగ్ గనుక ప్రాపర్ గా క్లిక్ అయినా చాలు సినిమా గురించి నెట్టింట ఒక రేంజ్ లో డిబేట్లు పెట్టేస్తారు.కానీ ఆదర్శకుటుంబంలో మాత్రం ఆ మార్క్ మిస్ అయిందన్న టాక్ వినబడుతుంది.చూడాలి మరి త్వరలో వచ్చే మరో సాంగ్ అయినా తమన్, త్రివిక్రమ్ కాంబో స్థాయిలో ఉంటుందో లేదో !

ALSO READ :తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

Tags

Related News

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

ఆరు ముఖాలు కలిగిన బొమ్మ..గాడ్ ఆఫ్ వార్ పై త్రివిక్రమ్ అప్డేట్!

చొక్కా నలగకుండా 500 కోట్లు.. జైలర్ 2 పై అల్లు అర్జున్ పోస్ట్!

బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

Big Stories

Advertisement
×